Advertisement
Google Ads BL

దసరా కి ఫిక్స్ చేసే యోచనలో బాలయ్య


నందమూరి నటసింహం-బాబీ కాంబోలో పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న NBK109 షూటింగ్ ఆల్మోస్ట్ డన్. రీసెంట్ గానే NBK 109 గ్లిమ్ప్స్ వదిలి అభిమానులకి పూనకాలు తెప్పించారు. బాలయ్య పవర్ఫుల్ యాక్షన్ రో లో సింహం మాదిరి గర్జిస్తున్నారు. మరి ఈ చిత్రాన్ని టైటిల్ ఇవ్వకుండానే గ్లిమ్ప్స్ తోనే విపరీతమైన అంచనాలు పెంచిన దర్శకుడు బాబీ ఈ చిత్రానికి విడుదల ముహూర్తం ఎప్పుడు పెడతారో అని నందమూరి అభిమానులు చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నారు.

Advertisement
CJ Advs

అయితే NBK109 టైటిల్ తో పాటుగా విడుదల తేదీని ఇచ్చేందుకు మేకర్స్ సిద్దమవుతున్నారని అది కూడా ఉగాదికే అని తెలుస్తోంది. NBK109 ని దసరా కి విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని సమాచారం. ఇప్పటికే ఎన్టీఆర్ దేవర, విష్ణు కన్నప్ప లాంటి భారీ చిత్రాలు దసరాకే విడుదలకు సిద్దమవుతుండగా.. ఇపుడు దసరా బరిలో నందమూరి బాలయ్య కూడా కచ్చిఫ్ వేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు ఈసారి బాబాయ్-అబ్బాయ్ అంటే బాలయ్య-ఎన్టీఆర్ బాక్సాఫీసు ఫైట్ కూడా తప్పదని అంటున్నారు.

మరి బాలయ్య వార్ డిక్లెర్ చేస్తే ఎవ్వరైనా తగ్గాల్సిందే. అసలైతే సమ్మర్ లోనే NBK109 విడుదల కావాల్సి ఉన్నా ఏపీ ఎలక్షన్ కారణంగా ఆ చిత్రం కాస్త లేట్ గా అంటే దసరాకి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నట్లుగా  తెలుస్తుంది. 

Balayya to give dussehra treat for fans:

NBK 109 Release Update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs