పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి చిత్రం మే 9 న విడుదలవుతుందా.. లేదంటే ఏపీ ఎలక్షన్స్ తో వాయిదా పడుతుందా.. అనేది మేకర్స్ ఏ విషయం తేల్చకపోయినా.. ప్రభాస్ అభిమానులు మాత్రం కల్కి పై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. కల్కిలో ప్రభాస్ భైరవ గా కనిపించబోతున్నారు. భైరవ లుక్ లో ప్రభాస్ ని చూడగానే అభిమానులతో పాటుగా కామన్ ఆడియెన్ కూడా తెగ ఇంప్రెస్స్ అయ్యారు. అందులో ఈ చిత్రంలో లెజెండరీ నటులు కమల్ హాసన్, అమితాబచ్చన్, దీపికా పదుకొనె, దిశా పటానిలు నటిస్తున్నారు.
తాజాగా కల్కి 2898 AD చిత్ర నిర్మాతల్లో ఒకరైన స్వప్న దత్ సౌత్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ ఓపెనింగ్ సెర్మనీ లో పాల్గొంది. అందులో భాగంగా స్వప్న దత్ ప్రభాస్ పై, ఆయన కల్కి కేరెక్టర్ పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. కల్కి చిత్రంలో ప్రభాస్ చేస్తున్న భైరవ పాత్ర ఎప్పటికీ ఆడియన్స్ మదిలో గుర్తుండిపోతుందని, భైరవ పాత్రలో ప్రభాస్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసారని చెప్పడంతో ప్రభాస్ ఫాన్స్ ఆనందానికి పట్ట పగ్గాల్లేకుండా పోయాయి.
కల్కి పై స్వప్న దత్ ఇచ్చిన ఈ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ తో ఇప్పటివరకు కల్కి పై ఉన్న అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. కల్కి షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తి కాగా.. దర్శకుడు నాగ్ అశ్విన్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వున్నారు.