Advertisement
Google Ads BL

RC17 కూడా లైన్ లోకొచ్చేసింది


రాంచరణ్ గేమ్ ఛేంజర్ షూటింగ్ తో పాటుగా రీసెంట్ గా బుచ్చి బాబు దర్శకత్వంలో RC16 మొదలు పెట్టేసాడు. గేమ్ ఛేంజర్ షూటింగ్ ఇంకా ఓ కొలిక్కి రాకపోవడంతో రామ్ చరణ్ బుచ్చి బాబు చిత్రాన్ని లైన్ లో పెట్టాడు. ప్రీ ప్రొడక్షన్, స్క్రిప్ట్ అన్నీ పక్కాగా ఉండడంతో చరణ్ ఇకపై RC16 షూటింగ్స్ లో పాల్గొంటాడు. అయితే రెండు రోజుల క్రితం పూజా కార్యక్రమాలు జరుపుకున్న RC16 ఎప్పుడు సెట్స్ మీదకి వెళుతుందో అనే మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు. బుచ్చి బాబు మాత్రం పక్కా ప్యాన్ ఇండియా మూవీగా RC16 కి రంగులద్దుతున్నాడు. 

Advertisement
CJ Advs

హీరోయిన్ గా జాన్వీ ని ఎంపిక చేయడం, మ్యూజిక్ డైరెక్టర్ గా రెహ్మాన్ ని దించడం తో పాటుగా విలన్ కేరెక్టర్ కోసం కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమారన్ ని తీసుకోవడం అన్నీ RC16 పై హైప్ క్రియేట్ చేసేలా ఉన్నాయి.

అయితే తాజాగా రామ్ చరణ్ తదుపరి మూవీ కూడా లైన్ లోకి వచ్చేసింది అనే టాక్ వినిపిస్తోంది. రామ్ చరణ్ కి రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన దర్శకుడు సుకుమార్ తో రామ్ చరణ్ తదుపరి మూవీ ఉండబోతుంది అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సుకుమార్ తోనే చరణ్ నెక్స్ట్ అంటున్నారు.

పుష్ప 2 చిత్రం తర్వాత సుకుమార్ కి విజయ్ దేవరకొండ తో కమిట్మెంట్ ఉంది. కానీ ఇప్పుడు విజయ్ దేవరకొండ ఫిల్మ్ ని పక్కనబెట్టి రామ్ చరణ్ తోనే సుక్కు నెక్స్ట్ ప్లాన్స్ ఉంబోతున్నాయని తెలుస్తోంది.

Ram Charan-Sukumar planning Rangasthalam sequel:

 Ram Charan-Sukumar to repeat their combo
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs