రష్మిక మందన్న ఫిట్ నెస్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఫిట్ నెస్ కోసం చాలా శ్రమ పడుతుంది. షూటింగ్స్ కి వెళుతున్నా రష్మిక మాత్రం ఏదో ఒక సమయంలో జిమ్ లో వర్కౌట్స్ చెయ్యాల్సిందే. అందానికి, గ్లామర్ గా ఉండడం కోసం అలాగే శరీరాకృతి కోసం రష్మిక కష్టపడి వర్కౌట్స్ చేస్తుంది. యోగ కన్నా ఎక్కువగా ఆమె జిమ్ లో వర్కౌట్స్ కి ప్రిఫరెన్స్ ఇచ్చే రష్మిక మందన్న తాజాగా వదలిన వీడియో చూస్తే షాకవ్వాల్సిందే.
అందాలతో వర్కౌట్స్ లో జిమ్ లో చమటలు కక్కుతోంది. హీరోయిన్స్ అందరూ ఫిగర్ ఎర్ఫెక్ట్ గా ఉండేందుకు జిమ్ చెయ్యడం కామన్. కానీ రష్మిక, సమంత, రకుల్ లాంటి వాళ్ళు మాత్రం ఇలా జిమ్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. తరచూ వర్కౌట్ వీడియోస్ తో ఖుషి చేస్తారు. ప్రస్తుతం రష్మిక మందన్న క్రేజీ హీరోయిన్ గా ప్యాన్ ఇండియా సినిమాలతో పాటుగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాలు చేస్తూ యమా బిజీగా ఉంటుంది.
ఇక సోషల్ మీడియాలోనూ రకరకాల ఫోటో షూట్స్ తో రష్మిక ఎప్పుడూ యాక్టీవ్ గా కనబడుతుంది. సారీ లుక్, మోడ్రెన్ డ్రెస్సులతో రష్మిక అదరగొడుతూ ఉంటుంది.