మ్యాన్ ఆఫ్ మాస్ ఎన్టీఆర్ తన రాబోయే యాక్షన్ డ్రామా దేవర తో గర్జించడానికి రెడీగా ఉన్నాడు. గార్జియస్ జాన్వీ కపూర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. దేవర పార్ట్ 1 అక్టోబర్ 10, 2024న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ప్రస్తుతం గోవాలో జరుగుతున్న దేవర మూవీ షూటింగ్ నుంచి తాజాగా మేకర్స్ సెట్స్ నుండి వర్కింగ్ స్టిల్‌ను విడుదల చేసారు.. ఇందులో ఎన్టీఆర్ చెక్స్ షర్ట్, లుంగీతో గూస్‌బమ్స్ తెప్పించే లుక్‌తో కనిపించాడు. ప్రస్తుతం రాజు సుందరం కొరియోగ్రఫీలో ఎన్టీఆర్ నటిస్తున్న మాంటేజ్ సాంగ్ షూట్ జరుగుతోంది. ఎన్టీఆర్-జాన్వీ కపూర్ పై ఈ పాటని కొరటాల శివ చిత్రీకరిస్తున్నారు. గోవాలోని అద్భుతమైన లొకేషన్స్ లో ఈ పాట చిత్రీకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఉన్నట్టుండి మేకర్స్ ఈ అప్ డేట్ వదలడం వెనుక పెద్ద కారణం ఉందని తెలుస్తోంది.
ఈ సినిమా షూటింగ్‌ను గోవాలో జరుగుతున్న విషయం తెలిసిందే. అక్కడ ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్‌లపై కొన్ని సీన్స్ తీస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ సెట్స్ నుంచి ఓ వీడియో లీక్ అయింది. ఆ వీడియోలో ఎన్టీఆర్ బ్లాక్ కలర్ షర్ట్, లుంగీతో గూస్‌బమ్స్ తెప్పించే లుక్‌తో కనిపించాడు. అదే వీడియోలో ఎన్టీఆర్ వాటర్‌లో పవర్‌ఫుల్ వాక్ చేస్తూ కనిపించాడు. దీంతో ఈ వీడియో క్షణాల్లోనే వైరల్‌గా మారిపోయింది. ఆ డ్యామేజ్ ని మరిపించడానికే మేకర్స్ తాజాగా వర్కింగ్ స్టిల్స్ వదిలారని చెప్పుకుంటున్నారు.