Advertisement
Google Ads BL

బండ్ల గణేష్, బన్నీ మామ ఆశలు ఆవిరి!


కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు వీరే.. ఎన్ని ట్విస్ట్‌లో!

Advertisement
CJ Advs

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విజయం దక్కించుకున్న కాంగ్రెస్.. పార్లమెంట్ ఎన్నికల్లో అదే జోరు సాగించాలని భావిస్తోంది. ఇందుకోసం ఎంపీ అభ్యర్థులుగా గెలుపు గుర్రాలను సెలక్ట్ చేసింది హైకమాండ్. ఇప్పటికే పలువురు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ తాజాగా.. ఐదుగురు అభ్యర్థులను ప్రకటించింది. సికింద్రాబాద్ : దానం నాగేందర్, మల్కాజిగిరి : సునీతా మహేందర్ రెడ్డి, చేవెళ్ల : గడ్డం రంజిత్ రెడ్డి,  పెద్దపల్లి : గడ్డం వంశీ కృష్ణ, నాగర్ కర్నూలు : మల్లు రవిని అభ్యర్థులుగా కాంగ్రెస్ ప్రకటించింది. కాగా.. ఈ ఐదుగురిలో మల్లు రవి మాత్రమే కాంగ్రెస్ కట్టర్ మనిషి.. మిగిలిన నలుగురు మాత్రం వలస పక్షులే. మొదట్నుంచీ కాంగ్రెస్‌లో ఉన్న దానం.. 2019 ఎన్నికల ముందు కారెక్కేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో ఇప్పుడు మళ్లీ సొంతగూటికి చేరుకున్నారు. అయితే ఒకప్పుడు ట్విన్ సిటీలు అయిన సికింద్రాబాద్, హైదరాబాద్‌లో పేరుగాంచిన నేత. వైఎస్, పీజేఆర్ హయాంలో సిటీని ఓ ఊపు ఊపిన నేత. అయితే.. సెటిల్మెంట్‌లు, దందాలు, రౌడీయిజం కూడా తక్కువేమీ కాదు. కాంగ్రెస్ అధికారంలో ఉండగా ఈయన చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావని ఆయన సొంత మనుషులే మీడియా ముందుకొచ్చిన చెప్పిన సందర్భాలున్నాయి. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ఈయన కాంగ్రెస్‌లో చేరిపోతారని భావించినప్పటికీ.. నిదానంగానే సొంతగూటికి వచ్చేశారు.

బాబోయ్ ఇన్ని ట్విస్టులా..?

ఇక చేవెళ్ల, మల్కాజిగిరి అభ్యర్థుల విషయంలో కూడా చాలా ట్విస్టులే చోటుచేసుకున్నాయని చెప్పుకోవచ్చు. మాజీ మంత్రి, సీనియర్ నేత పట్నం మహీందర్ రెడ్డి, ఆయన సతీమణి సునీతా మహేందర్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో చేవెళ్ల ఎంపీ టికెట్ పక్కాగా ఈ కుటుంబానికే అని.. అధికారిక ప్రకటన మాత్రమే మిగిలుందని వార్తలు వినిపించాయి. అయితే.. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో సీన్ మొత్తం మారిపోయింది. సిట్టింగ్ ఎంపీ కావడం, ఆర్థికంగా, రాజకీయంగా బాగా ఉన్న మనిషి కావడంతో రంజిత్ రెడ్డికే కేటాయించేసింది అధిష్టానం. ఇక సునీతాకు కూడా న్యాయం చేయాలని భావించిన కాంగ్రెస్.. మల్కాజిగిరి ఎంపీ స్థానాన్ని కేటాయించడం జరిగింది. అసలు చేవెళ్ల ఎక్కడ.. మల్కాజిగిరి ఎక్కడ..? అనేది ఇప్పుడు ఆమె అభిమానులు, కార్యకర్తల నుంచి ప్రశ్న. అయితే సిట్టింగ్ సీట్ కావడం, పైగా సీఎం రేవంత్ రెడ్డి ఇదివరకు ఇక్కడ్నుంచే ప్రాతినిథ్యం వహించడంతో గెలుపు పక్కా అని.. మెజార్టీనే లెక్క అని అందుకే సునీతాను రంగంలోకి దింపినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇక పెద్దపల్లి విషయానికొస్తే.. కాంగ్రెస్ ఎమ్మెల్యే, వీ6 చానెల్ యజమాని గడ్డం వివేక్.. కుమారుడే గడ్డం వంశీ కృష్ణ. ఈయన కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ.. ఇలా అన్నీ తిరిగి కాంగ్రెస్ గూటికి వచ్చి చేరిన నేతే. మొదట్నుంచీ వంశీకే టికెట్ వస్తుందని వచ్చిన వార్తలు అక్షరాలా నిజమయ్యాయి.

బండ్ల, బన్నీ మామ ఆశలు అడియాసలు!

ఇక మల్కాజిగిరి విషయానికొస్తే.. ఇదిగో టాలీవుడ్ నిర్మాత, వ్యాపారవేత్త బండ్ల గణేష్‌.. అదిగో హీరో బన్నీ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డికి ఇస్తున్నారని పెద్ద ఎత్తున పుకార్లు షికార్లు చేశాయి. పైగా మొదట్నుంచీ కాంగ్రెస్‌లో ఉన్న బండ్ల.. టికెట్ తనకే వస్తుందని కోటి ఆశలు పెట్టుకున్నారు. రాజీనామా చేసి, రాజకీయాలకు గుడ్ బై చెప్పిన బండ్ల.. మళ్లీ పాలిటిక్స్‌లోకి విచ్చేశారు. ఇక చూసుకో.. అవతలి వ్యక్తి ఎంతటోడైనా సరే తగ్గేదేలే అన్నట్లుగా మీడియా మీట్‌లు, ఇంటర్వ్యూలు, ప్రకటనలు ఓ రేంజ్‌లో రెచ్చిపోయారు. అనుకున్నట్లుగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేసింది. ఇక మరింత రెచ్చిపోయి.. ఏకంగా కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్‌లనే టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ వచ్చారు. సీఎం రేవంత్ అండదండలు కూడా మెండుగా ఉండటం, గట్టిగా ఖర్చుపెట్టే పరిస్థితి ఉండటంతో బండ్లకే టికెట్ అని ప్రచారం జరిగింది. కట్ సీన్‌లోకి బీఆర్ఎస్ నుంచి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి.. కాంగ్రెస్‌లో చేరడంతో పక్కాగా టికెట్ ఈయనకే అని ప్రచారం జరిగింది. ఇంకేముంది టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎన్నికల ప్రచారం చేస్తారని కూడా వార్తలు వచ్చాయి. ఈ ఇదర్నీ కాదని.. ఇప్పుడు సునీతాకు టికెట్ ఇవ్వడం ఊహించని పరిణామమే అని చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో బండ్ల, బన్నీ మామల నుంచి వచ్చే రియాక్షన్ ఎలా ఉంటుందో వేచి చూడాలి మరి.

Bandla Ganesh, Bunny Mama hopes evaporated!:

These are the Congress MP candidates.. in many twists!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs