Advertisement
Google Ads BL

ఓం భీమ్ బుష్ ప్రీమియర్ టాక్


శ్రీ విష్ణు అంటే ఈ మధ్యన నిర్మాతలకి భరోసా కనిపిస్తుంది. ఆయనతో తక్కువ బడ్జెట్ తో సినిమా చేసిన నిర్మాతలకి బోలెడన్ని లాభాలు, గత ఏడాది సామజవరగమన చిత్రంతో కామెడీ  హిట్ కొట్టిన శ్రీ విష్ణు మరోసారి అదే జోనర్ లో కమెడియన్స్ రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి లతో కలిసి శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో ఓం భీం బుష్ మూవీ చేసాడు. ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ తో అందరిలో ఆసక్తి కలిగేలా చేసారు. ఓం భీమ్ బుష్ సినిమాపై మొదటి నుంచి మంచి బజ్ క్రియేట్ అయింది. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్స్, టీజర్స్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. 

Advertisement
CJ Advs

మరి నేడు ప్రేక్షకుల ముందుకు వస్తోన్న ఓం భీమ్ బుష్ చిత్రం ప్రీమియర్స్ టాక్ ఎలా ఉందొ చూద్దాం.. ఓం భీం బుష్ నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్.. అంటూ దర్శకుడు పెట్టిన టైటిల్ ఈ చిత్రానికి పర్ఫెక్ట్ గా సూటవుతుంది, దర్శకుడి కామెడీ టైమింగ్ అదిరింది.. కధ విషయం పక్కనబెట్టి సినిమాగా చూస్తే ప్రేక్షకులు పడి పడి నవ్వుకుంటారు. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ తో పాటు రచ్చరవి కూడా ఈ కామెడీ ఎంటర్ టైన్మెంట్ కి ప్లస్ పాయింట్.. వీరి నాలుగు కామెడీ వేరే లెవల్, చాలాకాలం తర్వాత ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ చూసి ప్రేక్షకులు ఈ వేసవి సెలవలని హాయిగా ఎంజాయ్ చెయ్యొచ్చు అంటూ ఓం భీమ్ బుష్ చూసిన వారు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

ఓం భీమ్ బుష్ సోషల్ మీడియాలో ఎటు చూసినా పాజిటివ్ రివ్యూస్ కనిపిస్తున్నాయి. సినిమా హిట్ అంటూ ఆడియన్స్ మాట్లాడుతున్నారు. కొంతమంది ఇంకాస్త ముందుకు వెళ్లి ఈ చిత్రానికి మా రేటింగ్ 3 అంటూ హడావిడి చేస్తున్నారు. 

Om Bheem Bush Premier Talk:

Om Bheem Bush Social Media Talk
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs