మరికొద్ది రోజుల్లో మొదలు కాబోతున్న మోస్ట్ అవైటెడ్ ప్యాన్ ఇండియా ఫిలిం SSMB29 పై ఏ చిన్న వార్త వినిపించినా అది సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ గా మారుతుంది. రీసెంట్ గా దర్శకుడు రాజమౌళి మహేష్ తో చెయ్యబోయే చిత్రం స్క్రిప్ట్ వర్క్ పూర్తి అవగా.. ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నట్లుగా చెప్పి మహేష్ అభిమానులని ఎగ్జైట్ చేసారు. ఆర్.ఆర్.ఆర్ సినిమా జపాన్ లోని ఒక థియేటర్ లో 500 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా స్పెషల్ స్క్రీనింగ్ కోసం రాజమౌళి కుటుంబ సభ్యులతో జపాన్ వెళ్లారు.
అయితే ట్విట్టర్ లో కార్తికేయ జపాన్ లో వచ్చిన భూకంపం గురించి ట్వీట్ కి మహేష్ బాబు అభిమాని ఒకరు స్పందిస్తూ.. #SSMB29 సినిమా ట్రైలర్ ఇంపాక్ట్ కి రిహార్సల్ చేస్తున్నారా అంటూ రీ ట్వీట్ చేశాడు. దానికి కార్తికేయ రిప్లై ఇస్తూ.. ఆ ఇంపాక్ట్ కేవలం జపాన్ లో మాత్రమే ఉండదు కదా ప్రపంచం అంతా ఉంటుంది అన్నట్లుగా రీ ట్వీట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయ్యింది.
మరి SSMB29 ప్యాన్ ఇండియా కాదు ప్యాన్ వరల్డ్ అని కార్తికేయ ట్వీట్ చూస్తే అర్ధమవుతుంది. అందుకే మహేష్ అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. మరి SSMB29 మొదలయ్యే క్షణం కోసం మహేష్ అభిమానుల ఎదురు చూపులు మరింత ఎక్కువయ్యాయి.