Advertisement
Google Ads BL

RC16పై కన్నడ స్టార్ హాట్ కామెంట్స్


రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబోలో బిగ్గెస్ట్ ప్యాన్ ఇండియా ఫిల్మ్ గా RC16 నిన్న బుధవారం హైదరాబాద్ లో గ్రాండ్ గా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న జాన్వీ కపూర్ దగ్గర నుంచి మ్యూజిక్ అందించే ఏ ఆర్ రెహ్మాన్ వరకు అందరూ RC16 పూజా కార్యక్రమాల్లో సందడి చేసారు. మెగాస్టార్ చిరు ముఖ్య అతిధిగా ఈ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. ఈ చిత్రంలో రామ్ చరణ్ తో తలపడే పవర్ ఫుల్ విలన్ గా కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ నటించబోతున్నారనే ప్రచారం ఉంది.

Advertisement
CJ Advs

తాజాగా శివ రాజ్ కుమార్ ఒక ఇంటర్వ్యూలో RC16 కి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను పంచుకోవడమే కాదు, తన రోల్ పై ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రామ్ చరణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది, తప్పకుండా RC16 సరికొత్తగా ఉంటుంది, ఇక తన కేరెక్టర్ ని దర్శకుడు బుచ్చిబాబు ఎలా ఉహించి డిజైన్ చేశాడు అనేది ఆలోచిస్తేనే మైండ్ బ్లాక్ అవుతుంది.. ఎందుకంటే ఆ క్యారెక్టర్ లో అన్ని భిన్నమైన లేయర్స్ ఉన్నట్లుగా చెప్పిన ఆయన తన పాత్ర వేరే లెవల్ అంటూ కామెంట్స్ చేసాడు.

అంతేకాకుండా రామ్ చరణ్ ఔట్ స్టాండింగ్ యాక్టర్ అని, నైస్ హ్యుమన్ బీయింగ్ అంటూ శివరాజ్ కుమార్ చేసిన కామెంట్స్ తో మెగా ఫాన్స్ ఉబ్బితబ్బివవుతున్నారు. మరి ఈ లెక్కన RC16 లో బోలెడన్ని కొత్త పాత్రలు, కొత్త కొత్త ఎంట్రీలు ఉండబోతున్నాయన్నమాట. 

Shiva Rajkumar on RC16:

Shiva Rajkumar Impressed by RC16 Script
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs