Advertisement
Google Ads BL

అక్కినేని ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్


అక్కినేని హీరోలయిన నాగార్జున ఈఏడాది నా సామిరంగా తో హిట్ అందుకుని ప్రస్తుతం శేఖర్ కమ్ముల-ధనుష్ కలయికలో తెరకెక్కుతున్న కుబేర చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆ చిత్ర షూటింగ్ కి హాజరవుతున్నారు కూడా. మరోపక్క నాగ చైతన్య దూత వెబ్ సీరీస్ బ్లాక్ బస్టర్ అయ్యాక సక్సెస్ ఫుల్ డైరెక్టర్ చందు మొండేటితో చేతులు కలిపి తండేల్ చిత్రం చేస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. ఇక అఖిల్ నెక్స్ట్ కోసం ఎప్పటినుంచో అందరూ వెయిటింగ్.

Advertisement
CJ Advs

ఇంతలోపులో అక్కినేని అభిమానులు వినాల్సిన బ్యాడ్ న్యూస్ ఏమిటంటే..నాగ చైతన్య-విక్రమ్ కుమార్ కలయికలో తెరకెక్కిన దూత వెబ్ సీరీస్ గత ఏడాది విడుదలై అమెజాన్ ప్రైమ్ లో సూపర్ హిట్ సీరీస్ గా నిలిచింది. చైతు డిజిటల్ ఎంట్రీ తోనే సూపర్ సక్సెస్ అందుకున్నాడు. దూతలో చైతు మేకోవర్, యాక్టింగ్, విక్రమ్ కుమార్ డైరెక్షన్, స్టోరీ, స్క్రీన్ ప్లే అన్ని ఆడియన్స్ ని విపరీతంగా ఇంప్రెస్స్ చేసాయి. అయితే దూత కి సీక్వెల్ దూత 2 ఉంటుంది అనుకున్నారు.

అమెజాన్ ప్రైమ్ కంటెంట్ లాంచ్ ఈవెంట్ లో దీనికి సీక్వెల్ ప్రకటిస్తారనే ఊహాగానాలు బలంగా వచ్చాయి. ఎందుకంటే నాగ చైతన్య ఈవెంట్ కి వెళ్ళాడు. అందుకే దూత 2 ప్రకటిస్తారని అనుకున్నారు. కానీ ఆ ఈవెంట్ లో దూత 2ని ప్రకటించలేదు. దూత ని సక్సెస్ చేసినందుకు హీరో చైతు, డైరెక్టర్ విక్రమ్ ని పిలిచి థాంక్స్ చెప్పి పంపించారు .అంతేకాని సీక్వెల్ పై అప్ డేట్ లేదు.

ఇది అక్కినేని అభిమానులకి బ్యాడ్ న్యూస్ అవుతుంది కదా. మరి చైతు ఇకపై డిజిటల్ ప్లాట్ ఫామ్ మీదకి దూరంగా ఉండాలి అనుకుంటున్నాడో, లేదంటే విక్రమ్ కుమార్ బిజీ వలన దూత 2 చెయ్యడం లేదో కానీ.. ఇది మాత్రం అభిమానులని నిరాశ పరిచే విషయమనే చెప్పాలి.

Bad news for Akkineni fans:

Just like there is no Dhootha web series sequel
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs