కొద్దిరోజులుగా ఏ భారీ బడ్జెట్ సినిమా టైటిల్ కార్డు చూసినా.. ఓటీటీ పార్ట్నర్ కింద నెట్ ఫ్లిక్స్ పేరే పడుతుంది. భారీ బడ్జెట్, స్టార్ హీరోల సినిమాలు, మీడియం రేంజ్ సినిమాలు ఇలా ఏ సినిమా చూడండి ఓటీటీ పార్ట్నర్ నెట్ ఫ్లిక్స్ అంటున్నారు. అసలు నెట్ ఫ్లిక్స్ తో టాలీవుడ్ మేకర్స్ ఎలా టయ్యప్ అయ్యారు, భారీ చిత్రాలకి నెట్ ఫ్లిక్స్ బడ్జెట్ షేర్ చేస్తుందా, ప్రతి సినిమాని నెట్ ఫ్లిక్స్ ఎలా దక్కించుకుంటుంది అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో నెట్ ఫ్లిక్స్ హావ తప్ప అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్, జీ 5, ఆహా ఈ ఓటీటీలు అంతగా కనిపించడం లేదు. నెట్ ఫ్లిక్స్ మాత్రం బాగా పాతుకుపోయింది.
ఒకప్పుడు అన్నిటికి అమెజాన్ ప్రైమ్ కేరాఫ్ గా కనిపించేది. ఏ చిత్రమైనా అమెజాన్ లోనే చూసేవాళ్ళు, నెట్ ఫ్లిక్స్ కాస్ట్లీ కాబట్టి అందులో చాలా రేర్ గా సినిమాలు వీక్షించేవారు. కానీ కొద్దిరోజులుగా అమెజాన్ ప్రైమ్ బాగా డల్ అయ్యింది. అమెజాన్ ప్రైమ్ ని తొక్కేసి నెట్ ఫ్లిక్స్ బాగా పెరిగిపోయింది. ఇలాంటి సందర్భంలో నెట్ ఫ్లిక్ కి చెక్ పెట్టాలంటే అమెజాన్ వల్లే అవుతుంది. అందుకే అమెజాన్ ప్రైమ్ వాళ్ళు ముంబై వేదికగా ఓ పెద్ద ఈవెంట్ ని ఆర్గనైజ్ చేసి తాము కొన్న భారీ చిత్రాలు, తీసిన, తీస్తున్న వెబ్ సిరీస్లు, ఇంకా కొన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్ గురించి ఈవెంట్ నిర్వహించింది. అందులో నటించిన స్టార్స్ చేత ప్రమోషన్స్ ఇప్పించింది.
ఆ ఈవెంట్ లో టాలీవుడ్ లో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న పెద్ద సినిమాల్ని అమెజాన్ ప్రైమ్ డిజిటల్ హక్కులని కొనేసినట్టుగా పోస్టర్స్ వేసి మరీ ప్రకటించాయి. కళ్ళు చెదిరే ఈవెంట్ లో అమెజాన్ ప్రైమ్ ఓటీటీ పార్ట్నర్ గా నిలిచిన చిత్రాలను ఆయా మేకర్స్ మధ్యలో అనౌన్స్ చేసింది. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, తమ్ముడు, కాంతారా, కంగువ లాంటి ప్రముఖ చిత్రాలకు ఓటీటీ పార్ట్నర్ గా అమెజాన్ ప్రైమ్ ఉంది అని ప్రకటించారు.
మరోపక్క బిగ్ వెబ్ సీరీస్ లు ఈ ఏడాది అమెజాన్ ప్రైమ్ నుంచి రాబోతున్నట్టుగా అనౌన్స్ చేసారు. ఆ వెబ్ సీరీస్ స్టార్స్ అంతా ఎఈవెంట్ స్టేజ్ పై సందడి చేసారు. దీనితో ఒక్కసారిగా అమెజాన్ ప్రైమ్ పై ప్రేక్షకుల దృష్టి పడింది. మరి నెట్ ఫ్లిక్స్ లాంటి పెద్ద సంస్థని ఎదుర్కోవాలంటే ఈ మాత్రం చెయ్యాల్సిందే అంటున్నారు నెటిజెన్స్.