Advertisement
Google Ads BL

విడిపోయాక ఒకే స్టేజ్ పై సమంత-చైతన్య

samantha | విడిపోయాక ఒకే స్టేజ్ పై సమంత-చైతన్య

సమంత, నాగ చైతన్య ప్రేమ పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరూ కలిసి మజిలీ సినిమా చేసారు.  ఆచిత్రం లో కలిసి నటించడంతో పాటుగా, ఇద్దరూ కలిసి ఆ చిత్రాన్ని ప్రమోట్ కూడా చేసారు. అప్పుడు వారిద్దరి అనుబంధాన్ని చూసి అభిమానులు ఎంతో ముచ్చటపడ్డారు. కానీ ఈ జంట విడిపోయింది. విడాకులు తీసుకుని అభిమానులనే కాదు కామన్ ఆడియన్స్ ని కూడా బాధపడేలా చేసింది. సమంత ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా విడాకుల విషయం మాట్లాడుతూ సింపతీ క్రియేట్ చేసుకున్నా.. నాగ చైతన్య మాత్రం ఇప్పటికీ సైలెంట్ గానే ఉన్నాడు. వీరెందుకు విడిపోయారో రకరకాల ఊహాగానాలు వినిపించినా అసలు కారణం మాత్రం తెలియదు.

Advertisement
CJ Advs

మరి విడిపోయాక ఎవరి కెరీర్ లో వాళ్ళు బిజీ అయ్యారు. సమంత చైతూతో విడిపోక ముందే రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చింది. విడిపోయాక వాళ్ళ దర్శకత్వంలోనే సిటాడెల్ వెబ్ సీరీస్ చేసింది. ఈ రెండు సీరీస్ లు అమెజాన్ ప్రైమ్ ఓటీటీ కోసం చేసినవే. అటు నాగ చైతన్య కూడా దూత సీరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చాడు. దూత తో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న నాగ చైతన్య దానిని అమెజాన్ ప్రైమ్ ఓటీటీ కోసం చేసాడు. అయితే ఇప్పుడు వాళ్ళ వెబ్ సీరీస్ ల ప్రమోషన్స్ మోసం నాగ చైతన్య-సమంత అనుకోకుండా ఒకే స్టేజ్ పై కనిపించారు. 

అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం వారు నటించిన వెబ్ సిరీస్ లను ప్రమోట్ చెయ్యడానికి ముంబై వెళ్లారు. అమెజాన్ ఈవెంట్ ను హోస్ట్ చేసిన బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్ చైతూని, సమంత ని వేర్వేరుగా స్టేజీ మీదకు ఆహ్వానించారు. ఒకేసారి కలిసి కనిపించకపోయినా, కలిసి వేదిక మీద మాట్లాడనప్పటికీ, విడాకుల తర్వాత తొలిసారిగా ఒకే స్టేజీని పంచుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. చైతు, సమంతలు వేర్వేరుగా స్టేజ్ పైకి వస్తున్న వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరి ఆ ఈవెంట్ కి హాజరైన నాగ చైతన్య-సమంత ఒకరినొకరు విష్ చేసుకున్నారా.. లేదంటే ఏడ మొహం పెడ మొహం గానే ఉన్నారా అనే విషయంలో ఇప్పుడు నెటిజెన్స్ క్యూరియాసిటీగా ఉన్నారు.

Samantha-Chaitanya on the same stage after separation:

Samantha And Naga Chaitanya Attended For Amazon Prime Event
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs