Advertisement
Google Ads BL

అల్లు అర్జున్ తో ఛాన్స్ అంటే.. లక్కీనే!


ప్యాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ తో నటించే ఛాన్స్ అంటే మాములు విషయం కాదు. పుష్ప తో సోలోగా ప్యాన్ ఇండియా మార్కెట్లో సత్తా చాటి నార్త్ లో మెల్లగా గ్రాఫ్ పెంచుకున్న అల్లు అర్జున్ తో ఛాన్స్ అంటే ఎగిరి గంతెయ్యాల్సిందే. మరి అల్లు అర్జున్ తో ఆ ఛాన్స్ కొట్టేసిన హీరోయిన్ ఎవరో కాదు. యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రి. యానిమల్ చిత్రం తర్వాత అసలు హీరోయిన్ రష్మిక మందన్న పేరు కన్నా ఎక్కువగా కొసరు హీరోయిన్ గా నటించిన త్రిప్తి డిమ్రి పేరు మార్మోగిపోయింది.

Advertisement
CJ Advs

యానిమల్ రావడానికి ముందు ఈ హీరోయిన్ పేరు చాలామందికి పెద్దగా తెలియదు. ఆ తరువాత ఈ బ్యూటీ గురించి తెలియని వారు లేరు. యానిమల్ తర్వాత బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్స్ లో త్రిప్తి డిమ్రి పేరు వినిపిస్తోంది. ఇప్పుడు తాజాగా సుకుమార్-అల్లు అర్జున్ ల పుష్ప 2 లో త్రిప్తి డిమ్రి జాయిన్ అవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ పాప పుష్ప2లో కీలక పాత్ర పోషిస్తోందట. పుష్పరాజ్ అనుచరుడిని ట్రాప్ చేసే రోల్ లో త్రిప్తి డిమ్రీ నటించనుందట. ఇప్పటికే త్రిప్తిని మేకర్స్ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. 

పుష్ప2లో ఆమె పాత్ర చిన్నదే అయినా..  త్రిప్తి డిమ్రీ రోల్ ఎఫెక్ట్ సినిమాపై పడుతుందట. అంతేకాకుండా అల్లు అర్జున్ కి  త్రిప్తి డిమ్రీ మధ్యన కాంబో సీన్స్ ఇంట్రెస్టింగ్ గా ఉండనున్నాయని తెలుస్తోంది. మరి ఈలెక్కన బన్నీ తో ఛాన్స్ కొట్టేసిన త్రిప్తి డిమ్రీ లక్కీనే కదా.. 

Tripti Dimri To Become A Part Of Pushpa 2?:

Animal actress Tripti Dimri To Become A Part Of Pushpa 2?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs