నువ్వెంత అంటే నువ్వెంత అని తొడగొట్టి, నేను పాలమ్మినా, పూలమ్మినా అంటూ సినిమా డైలాగ్స్ చెబుతూ ఎంటర్టైన్మెంట్ కా బాప్ అన్నట్టుగా BRS ప్రభుత్వంలో మంత్రిగా చక్రం తిప్పిన మల్లారెడ్డి ఇప్పుడు ఆస్తుల కోసం అల్లాడిపోతున్నాడు. కాంగ్రెస్ ని తొక్కేస్తా, రేవంత్ రెడ్డిని పరిగెత్తిస్తా అంటూ తొడ కొట్టిన మల్లారెడ్డి ఇప్పుడు రేవంత్ అప్పాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నాడు. BRS అధికారంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను కానకుండా కారు కూతలు కూసి ఇప్పుడు కాళ్ళు పట్టుకుంటానంటే వదులుతారా.. అస్సలు వదలరు. అప్పట్లో రేవంత్ రెడ్డిని పర్సనల్ గా ఎటాక్ చేసిన ఇప్పుడు మల్లారెడ్డి అడ్డంగా ఇరుక్కున్నాడు.
BRS ప్రభుత్వంలో అక్రంగా కూడబెట్టిన ఆస్తులకి కాంగ్రెస్ ప్రభుత్వం ఎసరు పెట్టింది. రోజుకో ఎటాక్ తో మల్లారెడ్డి వెన్నులో ఒణుకుపుట్టిస్తుంది. మొన్నటికి మొన్న మల్లారెడ్డి అల్లుడు కాలేజీ ఆక్రమిత కట్టడాలని కూలగొట్టిన రేవంత్ ప్రభుత్వం ఆ తర్వాత మల్లారెడ్డి ఆస్తులపై కన్నేసింది. మల్లారెడ్డి బిజినెస్ లోని లొసుగులన్నీ బయటికి లాగుతున్నారు. ఈరోజు మల్లారెడ్డి కంపెనీలు, ఇళ్లపై ఐటి దాడులు జరిపిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎగిరెగిరి పడటం, అధికారం పోగానే అనేక సమస్యలు ఎదురవడంతో మల్లారెడ్డికి చమటలు పడుతున్నాయి.
దానితో తానింక BRS పార్టీలో ఉండబోనని స్పష్టం చేసాడు. ఆస్తులు కాపాడుకోవాలంటే ఏదో ఒక జాతీయ పార్టీలో చేరడం తప్ప గత్యంతరం లేదు అన్నట్టుగా మల్లారెడ్డి కాంగ్రెస్ వైపు చూస్తుంటే రేవంత్ రెడ్డి అది జరగనిచ్చేట్టుగా లేడు. ఆటుపోయి కర్ణాటకలో శివ కుమార్ తో భేటీ అయ్యి రేవంత్ రెడ్డిని కూల్ చెయ్యమని అడిగినా పని జరగలేదు. ఇకపై BRS పార్టీలో ఉండబోనని.. తాను ఏదో ఒక జాతీయ పార్టీల్లో చేరిపోతానని, ఎవరు చేర్చుకున్నా చేరుతానని అంటున్నారు. అయితే తన ప్రయారిటీ కాంగ్రెస్ అంటూ తేల్చేసారు. కాంగ్రెస్ చేర్చుకోకపోతే…బీజేపీలో చేరుతానని ఆయన క్లారిటీ ఇస్తున్నారు.
మొత్తానికి రేవంత్ రెడ్డి రివెంజ్ తో కామెడీ చేసే మల్లారెడ్డి కూడా సీరియస్ నెస్ తో చమటలు కక్కుతూ ఆస్తుల కోసం అదిరిపడాల్సి వస్తుంది. చూద్దాం మల్లారెడ్డి పొలిటికల్ పయనం ఎటువైపో అనేది.!