Advertisement
Google Ads BL

చావు అంచులవరకు వెళ్ళొచ్చా: సురభి


హీరోయిన్ గా టాలీవడ్ లో సో సో గుర్తింపు తెచ్చుకున్న సురభి.. ప్రస్తుతం ఫామ్ లో లేదు. బాబ్లీ హీరోయిన్ గా కనిపించే సురభి శర్వానంద్, నాని లాంటి మీడియం రేంజ్ హీరోలతో నటించింది. ఆమెకి సక్సెస్ వచ్చినా హీరోయిన్ గా మాత్రం పెద్దగా గుర్తింపు రాలేదు. ప్రస్తుతం కెరీర్ డౌన్ ఫాల్ లో ఉన్న సురభికి మెగాస్టార్ తన విశ్వంభరలో ఛాన్స్ ఇచ్చారు. విశ్వంభర లో చిరుకి సిస్టర్ గా సురభి కనిపించబోతుంది అనే టాక్ ఉంది.

Advertisement
CJ Advs

అయితే తాజాగా సురభి తాను ఓ సంఘటనలో చావు అంచులవరకు వెళ్లొచ్చాను అంటూ చెప్పి అందరిని షాక్ కి గురి చేసింది. తాను త్రుటిలో చావు నుంచి తప్పించుకున్నాను, ఆ విషయం గుర్తు చేసుకుంటే వెన్నులో వొణుకొచ్చేస్తుంది అంటూ సురభి చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఇప్పటివరకు తాను ఫేస్ చెయ్యని ఓ ఘటన తాను ఆదివారం ఫేస్ చేసానని.. తాను ప్రయాణించిన ఓ విమానం సాంకేతిక లోపానికి గురై ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఏర్పడిందని.. విమానం పైలెట్ నియంత్రణలో లేకుండా పోయిందని, ఆ టైమ్ లో తనకి బాగా భయం వేసిందని చెప్పింది. 

అయితే పైలెట్ తెలివైన నిర్ణయం కారణంగా తామంతా ప్రాణాలతో బయటపడ్డామని, అది తలచుకుంటేనే చావు అంచులవరకు వెళ్ళొచ్చామనే భావన కలిగినట్లుగా చెప్పుకొచ్చింది. ఆ సంఘటన గుర్తొస్తే ఇప్పటికి భయంగానే ఉంది అంటూ సురభి చెప్పుకొచ్చింది. 

Can you go to the edge of death: Heroine Surabhi:

It is scary to touch the edge of death.. Heroine Surabhi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs