బాలీవుడ్ క్యూటీ మృణాల్ ఠాకూర్ మరికొద్ది రోజుల్లో ఫ్యామిలీ స్టార్ మూవీ తో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. విజయ్ దేవరకొండ తో జోడి కట్టిన మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో చాలా బ్యూటిఫుల్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తుంది. సీతారామం, హాయ్ నాన్న చిత్రాల్లో తన ప్రత్యేకతని చూపించిన మృణాల్ ఠాకూర్ ఫ్యామిలీ స్టార్ తో సక్సెస్ అందుకుని హ్యాట్రిక్ హిట్ ని నమోదు చేయాలని చూస్తుంది. అదలాఉంటే సౌత్ లో సక్సెస్ అయిన ఈ బ్యూటీ బాలీవుడ్ లో గ్లామర్ చూపిస్తున్నా అంతగా ఆమెకి అక్కడ వర్కౌట్ అవ్వడం లేదు.
తాజాగా మృణాల్ ఠాకూర్ పింక విల్లా అవార్డు వేడుకలో బ్లాక్ మోడ్రెన్ అవుట్ ఫిట్ లో ప్రెట్టి ప్రెట్టిగా అదరగొట్టేసింది. అందానికి అందం, కూల్ గా సింపుల్ లుక్స్ తో మృణాల్ చేసిన గ్లామర్ షో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దానితో ఒక్కసారిగా ట్విట్టర్ X లో #MrunalThakur హ్యాష్ టాగ్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఇక ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. బిజీ బిజీ టైం లో సరదాగా తీసుకునే విరామాలు మనల్ని మనం మరింత మెరుగు పరచుకునేందుకు, ఇంకా సినిమాల ఎంపిక విషయంలో కూడా ఎంతో దోహదపడతాయని అంటూ చెప్పుకొచ్చింది,
రెండుమూడేళ్లుగా తీరిక లేకుండా పని చేసుకుంటున్న తనకి నిద్ర కోసం ఆరాటపడిన సందర్భాలు చాలానే ఉన్నాయని, అందుకే బ్రేక్ దొరికితే ఫ్యామిలీతో కాస్త టైమ్ స్పెండ్ చెయ్యాలనిపిస్తుంది. తోటి నటులతో కలిసి జర్నీ చెయ్యాలనిపిస్తుంది అంటూ మృణాల్ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.