Advertisement
Google Ads BL

మహేష్ ని జపాన్ తీసుకొస్తా: రాజమౌళి


మహేష్ బాబు-రాజమౌళి కలయికలో తెరకెక్కబోయే SSMB29 ఎప్పుడు మొదలవుతుందో, రాజమౌళి మహేష్ ని ఎలా చూపించబోతున్నారో, ఏ జోనర్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారో, ఏ ఇండస్ట్రీ నుంచి హీరోయిన్ తీసుకొస్తారో, హాలీవుడ్ స్టార్స్ ని ఎవరిని దించుతారో అనే క్యూరియాసిటీ సినీ వర్గాల్లోనే కాదు.. హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ప్రేక్షకులందరిలో కనిపిస్తుంది. మహేష్-రాజమౌళి కలిసి కనిపించే క్షణం కోసం మహేష్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే SSMB29 పై ఉగాదికి అంటే  ఏప్రిల్ 9 కి క్లారిటీ రావచ్చనే టాక్ ఉంది. 

Advertisement
CJ Advs

ప్రస్తుతం రాజమౌళి జపాన్ లో ఉన్నారు. అక్కడ జపాన్ లో ఆర్.ఆర్.ఆర్ స్క్రీనింగ్ కి హాజరైన రాజమౌళిపై అక్కడి ప్రేక్షకులు విశేష అభిమానం చూపడం హాట్ టాపిక్ అయ్యింది. జపాన్ లో ఆర్.ఆర్.ఆర్ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. దానితో రాజమౌళి క్రేజ్ జపాన్ లో విపరీతంగా పెరిగింది. తాజాగా రాజమౌళి అక్కడి మీడియాతో మాట్లాడుతూ మహేష్ తో చేస్తున్న SSMB29 పై క్రేజీ అప్ డేట్ అందించారు. ప్రస్తుతం SSMB29 స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యింది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా శరవేగంగా జరుగుతుంది.

ఈ చిత్రానికి సంబంధించి హీరోని మాత్రమే లాక్ చేసాము, ఇంకా నటుల ఎంపిక పూర్తి కాలేదు. ఈచిత్రంలో హీరో మహేష్ బాబు, ఆయన తెలుగు హీరో, చాలా అందంగా ఉంటారు. మీకు ఆయన గురించి తెలిసే ఉంటుంది. వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని పూర్తి చేసి జపాన్ లో కూడా విడుదల చేస్తాం, మహేష్ బాబుని కూడా ఇక్కడికి తీసుకువస్తాను అంటూ రాజమౌళి జపాన్ ప్రేక్షకులకి మాటిచ్చేసారు. 

Japan will take Mahesh: Rajamouli:

SS Rajamouli Shares Fresh Updates About Mahesh Babu Starrer SSMB29
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs