Advertisement
Google Ads BL

కరీనా కపూర్ సౌత్ ఎంట్రీ కన్ ఫర్మ్


బాలీవుడ్ భామలు వరసగా సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ మధ్యలో ముందుగా అలియా భట్ట ఆర్.ఆర్.ఆర్ ప్యాన్ ఇండియా ఫిలిం తో బిగ్గెస్ట్ హిట్ కొట్టగా.. లైగర్ తో అనన్య పాండే సౌత్ ఎంట్రీ ఇచ్చింది. దీపికా పదుకొనె ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో కల్కి చిత్రంలో నటిస్తుంది. ఆ చిత్రం ఈ ఏడాది విడుదలవుతుంది. ఆ తర్వాత జాన్వీ కపూర్ దేవరతో సౌత్ ఎంట్రీ ఖాయం చేసుకుంది. ఆ చిత్రం విడుదల కాకుండానే రామ్ చరణ్ తో RC16 లో నటించేందుకు రెడీ అయ్యింది. ఇలా వరస అవకాశాలతో జాన్వీ కపూర్ అదరగొట్టేసింది. 

Advertisement
CJ Advs

ఆ తర్వాత ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ క‌రీనా క‌పూర్ కూడా సౌత్ లోకి వచ్చేందుకు రెడీ అయింది. గతంలోనే కరీనా కపూర్ సౌత్ ఎంట్రీ పై బోలెడన్ని న్యూస్ లు చక్కర్లు కొట్టాయి. అది ఇప్పుడు నిజమైంది. తాను సౌత్ కి ఎంట్రీ ఇస్తున్న విష‌యాన్ని కరీనా కపూర్ అధికారింగా ప్ర‌క‌టించింది. నేను త్వ‌ర‌లో ఓ భారీ ప్రాజెక్ట్ తో ద‌క్షిణాదిన అడుగుపెడుతున్నాను. అది ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్. మొద‌టిసారి ఇలాంటి భారీ సినిమాలో న‌టిస్తున్నాను. దీని కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అభిమానుల ఆస‌క్తిని నేను అర్దం చేసుకోగ‌ల‌ను.. అంటూ ఆమె సౌత్ ఎంట్రీని కన్ ఫర్మ్ చేసింది.

అయితే కరీనా నటిస్తున్న ఆ పాన్ ఇండియా ఫిలిం ఏది అనేది రివీల్ చెయ్యలేదు . అది యష్ కన్నడలో చెయ్యబోయే పాన్ ఇండియా ఫిలిం టాక్సిక్ లోనా.. లేదంటే ప్రభాస్ తో స్పిరిట్ లోనా అనేది తెలియలేదు. యాష్ తో కరీనా కపూర్ టాక్సిక్ లో నటించబోతుంది అనే ప్రచారం ఉంది. మరోపక్క సందీప్ వంగ ప్రభాస్ స్పిరిట్ కోసం కరీనాను ఎంపిక చేశారనే టాక్ ఉంది. 

Kareena confirms south debut:

Kareena Kapoor to romance Yash in Toxic?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs