సలార్ సీజ్ ఫైర్ గత ఏడాది డిసెంబర్ లో విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రశాంత్ నీల్-ప్రభాస్-పృథ్వీ రాజ్ సుకుమారన్ ల కలయికలో వచ్చిన ఈ చిత్రం మాస్ హిట్ గా నిలవడమే కాదు.. సలార్ శౌర్యంగ పర్వంపై విపరీతమైన క్యూరియాసిటీ అంచనాలు పెంచేసింది. ఇక ఏప్రిల్ నుంచి సలార్ శౌర్యంగ పర్వం షూటింగ్ మొదలు పెడతారంటూ ఆ చిత్రంలో కీలక పాత్ర పోషించిన బాబీ సింహ చెప్పారు. రీసెంట్ గా వరదరాజ పాత్రలో కనబడిన పృథ్వీ రాజ్ కూడా అదే విషయం చెప్పాడు. ఇప్పుడు మరో క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
సలార్ 1 లో తెలియని అనేక ప్రశ్నలు సలార్ శౌర్యంగ పర్వంలో చూపించబోతున్నారు. సీజ్ ఫైర్ మొత్తం యాక్షన్ సన్నివేశాలే హైలెట్ అవ్వగా.. ఇప్పుడు సలార్ శౌర్యంగ పర్వంలో ఇదే హైలెట్ అంటూ నటుడు బాబీ సింహ మరోసారి సలార్ పై ఇచ్చిన అప్ డేట్ క్రేజీ క్రేజీగా చక్కర్లు కొడుతోంది. సలార్ 1 క్లైమాక్స్ లో ఎలాంటి గూజ్ బంప్స్ సన్నివేశాలు ఉన్నాయో సలార్ 2 లో అంతకు మించి ఉండబోతున్నాయట. సలార్ శౌర్యంగ పర్వం లో వంద రెట్లు అధికంగా గూజ్ బంప్స్ వచ్చే విధంగా సన్నివేశాలు ఉంటాయని, ముఖ్యంగా సలార్ 2 క్లైమాక్స్ ప్రేక్షకులకు చాలా సర్‌ప్రైజింగ్, సినిమాలో మెయిన్ హైలెట్ గా గా ఉంటుందని ఆయన చెప్పుకొచ్చాడు.
సలార్ 1 సూపర్ హిట్ అయిన నేపథ్యంలో సలార్ 2 పై అంచనాలు పెరగడమే కాదు.. మధ్య మధ్యలో ఇలాంటి చిన్న చిన్న క్రేజీ అప్ డేట్స్ సోషల్ మీడియాలో కనిపించడంతో ఆ చిత్రంపై అంచనాలు పెరిగిపోతున్నాయి.