ఈమధ్యన చాలామంది హీరోయిన్స్ పెళ్లి బంధంలోకి అడుగుపెడుతున్నారు. ఈ ఏడాది రకుల్ ప్రీత్ సింగ్ ప్రేమికుడు జాకీ భగ్నానీ ని వివాహం చేసుకుంది. మరో హీరోయిన్ తాప్సి పెళ్లి చేసుకోబోతుంది అనే న్యూస్ ఉంది. ఇప్పుడు మాజీ హీరోయిన్ పెళ్లికి చేసుకుంది. తెలుగులో పవన్ కళ్యాణ్ తో తీన్మార్, హీరో రామ్ తో ఒంగోలు గిత్త, మంచు మనోజ్ తో మిస్టర్ నూకయ్య చిత్రాల్లో నటించిన కృతి కర్బందా పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది.
కృతి కర్బందా కొన్నాళ్లుగా పులకిత్ సామ్రాట్ తో డేటింగ్ లో ఉంది. ఇప్పుడు ఫైనల్లీ కృతి కర్బందా.. ప్రియుడు పులకిత్ సామ్రాట్ ను వివాహం చేసుకుంది. గురుగ్రామ్ లో శుక్రవారం బంధుమిత్రుల సమక్షంలో వీరిద్దరి వివాహం ఘనంగా జరిగింది. తమ పెళ్లి ఫోటోలను కృతి ఇన్ స్టాలో షేర్ చేశారు. తెలుగులో రామ్ చరణ్ కి అక్కగా బ్రూస్ లీ చిత్రంలో నటించిన కృతి కర్బందా ఆ తర్వాత బాలీవుడ్‌లోనే అడపాదడపా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.
బాలీవుడ్ హీరో పులకిత్ సామ్రాట్ ఫుక్రే సినిమాతో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అనంతరం సనమ్ రే, పాగల్ పంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.