నిహారిక కొణిదెల పెద్దలు కుదిర్చిన చైతన్య జొన్నలగడ్డని అంగరంగ వైభవంగా వివాహం చేసుకుంది. రెండేళ్లు సంతోషముగా ఉన్న ఈ జంట గత ఏడాది విడాకులు తీసుకుని వేరు అయ్యాక ఎవరి పనుల్లో వారు ఉన్నారు. నిహారిక ఇటు ఇండస్ట్రీలో నటిగా, నిర్మాతగా బిజీ అవ్వాలనే ప్రయత్నాల్లో ఉంటే.. చైతన్య జొన్నలగడ్డ సైలెంట్ గా తన పనేదో తనకు చూసుకుంటున్నాడు. ఈమధ్యన నిహారిక పెళ్లి, విడాకుల విషయంలో ఇచ్చిన ఇంటర్వ్యూ పై చైతన్య జొన్నలగడ్డ వన్ సైడ్ మాత్రమే మాట్లాడితే బాగోదంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.
తాజాగా నిహారిక రెండో పెళ్లి, పిల్లలపై చేసిన కామెంట్స్ కి చైతన్య జొన్నలగడ్డ ఇండైరెక్ట్ గా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. మాములుగా చైతన్య సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండడు. చైతన్య తాజాగా సైలెన్స్.. సైలెన్స్ అంటూ పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. అంతేకాకుండా సువిశాలమైన అంతరిక్షంలో నిశ్శబ్దం, నీటి అడుగున ఉన్న నిశ్శబ్దం, చల్లని శీతాకాలపు రాత్రి ఆవరించే నిశ్శబ్దం, మీ హృదయాన్ని బద్దలు కొట్టే విషయం విన్నప్పుడు వచ్చే సైలెన్స్, జీవితం మిమ్మల్ని ముంచెత్తినప్పుడు మీ ఆలోచనలలో మీరు కోరుకునే సైలెన్స్.. ఇలా నిశ్శబ్దం అనేది మీ ప్రాణశక్తిని ప్రకృతి శక్తి నుంచి వేరు చేస్తుంది.
ఇదే సైలెన్స్ దేవుడితో కలిపే మాధ్యమం అంటూ చైతన్య జొన్నలగడ్డ ఫిలాసఫీకల్ గా రాసుకొచ్చాడు చైతన్య. మరి ఈ స్టోరీ కూడా నిహారికని ఉద్దేశించే ఇండైరెక్ట్ గా పెట్టాడని నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.