నిహారిక కొణిదెల ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంది. వ్యక్తిగత జీవితంలో విడాకుల విషయంలో సఫర్ అయిన నిహారిక ప్రస్తుతం తన తల్లితండ్రులైన నాగబాబు-పద్మజల దగ్గరే ఉంటుంది. కరోనా సమయంలో పెద్దలు కుదిర్చిన చైతన్య జొన్నలగడ్డని గ్రాండ్ గా వివాహం చేసుకున్ననిహారిక ఆ తర్వాత భర్తతో వచ్చిన మనస్పర్ధలతో కోర్టుకెక్కి విడాకులు తీసుకుంది. అయితే భర్తతో విడిపోయాక నిహారికకు తరచూ సెకండ్ మ్యారేజ్ పై ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
తాజాగా నిహారిక రెండో పెళ్లి పై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. నాకు పిల్లలంటే చాలా ఇష్టం. మరి పిల్లలు కావాలంటే కచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందే. ఒక రిలేషన్‌షిప్ వర్కౌట్ కాలేదంటే చాలా కారణాలు ఉంటాయి. అలా ఎన్నో కారణాలతోనే నా పెళ్లి కూడా వర్కౌట్ కాలేదు. ఇకపై మళ్లీ ఒకరిపై ప్రేమ పుట్టదనుకుంటే అది మూర్ఖత్వమే అవుతుంది. వెంటనే అని చెప్పలేను కానీ నేను మళ్లీ పెళ్లయితే చేసుకుంటాను.. అంటూ నిహారిక తన రెండో పెళ్లిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
ఇక గతంలో నిహారిక పోలీస్ స్టేషన్ కి వెళ్లిన విషయంపై కూడా స్పందించింది. రాసిడన్ బ్లూ పబ్ కేసులో నన్ను నిజంగా అన్యాయంగా ఇరికించారు. నేను పబ్బులకు, పార్టీలకు వెళతాను కానీ చాలా తక్కువగా వెళ్తుంటాను. అప్పుడు ఆ హోటల్ కి నేను మా స్కూల్ ఫ్రెండ్స్‌ను కలవడానికి. ఆరు నెలల తర్వాత వారిని కలిసాను, అందుకే చాలాసేపు కబుర్లు చెప్పుకున్నాం. అయితే ఆ సౌండ్ మాకు ఇబ్బందిగా అనిపించడంతో ఇంటికి వెళ్లిపోదామనుకున్నాను. బిల్లు కట్టి బయటకు వచ్చే సమయానికి పోలీసులు వచ్చారు.
ఆ వెంటనే మేము చెబుతున్నా వినకుండా మమ్మల్ని స్టేషన్‌కు తీసుకెళ్లారు. మీడియాలో అప్పుడు ఎందుకింత రచ్చ చేశారో అస్సలు అర్థం కాలేదు. కానీ చాలా బాధేసింది. అదే హోటల్ లో కొంతమంది డ్రగ్స్ తీసుకున్నారని తెలిసింది. నేను తప్పుడు ప్రదేశంలో ఉన్నానని ఆలస్యంగా తెలుసుకున్నాను.. అంటూ నిహారిక తానేమి తప్పు చెయ్యలేదు అని చెప్పుకొచ్చింది.