రామ్ చరణ్ ప్రస్తుతం కోలీవుడ్ టాప్ డైరెక్టర్ శంకర్‌తో మూడు భాషల్లో భారీ బడ్జెట్‌తో గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కోసం రామ్ చరణ్ గురువారం రాత్రి వైజాగ్ బయలుదేరి వెళ్లారు. అక్కడ శంకర్ ఓ భారీ షెడ్యూల్‌ని ప్లాన్ చేశారు. అయితే రామ్ చరణ్ హైదరాబాద్ నుంచి వైజాగ్ ఎయిర్ పోర్ట్‌లో దిగగానే అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఇక తాజాగా రామ్ చరణ్‌కి సంబంధించిన పలు ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అందులో రామ్ చరణ్ రామ్ నందన్‌గా ఆఫీసర్ లుక్‌లో ఉన్న పిక్ బయటికి వచ్చింది.
దానితో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్‌లో రామ్ నందన్ కేరెక్టర్‌లో ప్రభుత్వ అధికారిగా కనిపించబోతున్నారంటూ మెగా ఫాన్స్ మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. నిజంగానే రామ్ చరణ్ ఈ లుక్‌లో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ రామ్ నందన్ నేమ ప్లేట్‌తో ఉన్న ఈ పిక్ సాంఘీక మాధ్యమాల్లో సెన్సేషన్‌ని క్రియేట్ చేస్తోంది.
గేమ్ ఛేంజర్ షూటింగ్ ఎలా ఉన్నా.. రామ్ చరణ్ తన తదుపరి మూవీ RC16 ని ఈ నెల 20 నుంచి మొదలు పెట్టబోతున్నారని, దర్శకుడు బుచ్చి బాబు ఆ మేరకు అన్ని ఏర్పాట్లని చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్.. జాన్వీ కపూర్‌తో రొమాన్స్ చేయనున్నారు. ఇందులో జాన్వీకపూర్ హీరోయిన్‌తో పాటు మరో హీరోయిన్ కూడా ఉంటుందనేలా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక గేమ్ ఛేంజర్‌కి సంబంధించి రామ్ చరణ్ పుట్టినరోజున యూనిట్ సర్‌ప్రైజ్‌ని ప్లాన్ చేసినట్లుగా ఇటీవల దిల్ రాజు చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.