Advertisement
Google Ads BL

కవిత అరెస్ట్.. గులాబీ పార్టీలో గుబులు!


కవిత అరెస్ట్.. ఇంట్లో రూ.100 కోట్లు, 50 కేజీల గోల్డ్!

Advertisement
CJ Advs

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుమార్తె ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇవాళ ఈడీ, ఐటీ అధికారులు 4 గంటలపాటు జరిపిన సోదాల అనంతరం కవితకు అరెస్ట్ వారెంట్ జారీచేసి.. ఆమెను ఇంట్లోనే అదుపులోనికి తీసుకోవడం జరిగింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన ఈడీ, ఐటీ బృందం.. కవిత ఇంట్లో కీలక పత్రాలతో భారీగా నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. 100 కోట్ల నగదు.. 50 కేజీల బంగారం దొరికినట్లుగా తెలుస్తోంది. అయితే అధికారికంగా మాత్రం ఇంతవరకూ ఈడీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాసేపట్లో ఈ సోదాలు, అరెస్టుకు సంబంధించి అధికారులు ప్రకటన చేసే అవకాశం ఉంది.

కవిత అరెస్ట్‌తో గులాబీ పార్టీలో గుబులు మొదలైంది. ఎన్నికల ముందు ఇలా జరిగిందేంటి..? అంటూ అగ్రనేతలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం కవిత నివాసానికి చేరుకున్న మాజీ మంత్రులు, కుటుంబ సభ్యులు కేటీఆర్, హరీష్ రావులను కూడా లోనికి ఈడీ అనుమతించలేదు. దీంతో అసలు లోపల ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి. అయితే శుక్రవారం రాత్రి 8 గంటలకు ఫ్లయిట్ టికెట్‌ను కవిత కోసం బుక్ చేసినట్లుగా తెలుస్తోంది. అంటే.. కవితను ఢిల్లీకి తరలిస్తారన్న మాట. అటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. 

ఇటు కార్యకర్తలు, అభిమానులు.. బీఆర్ఎస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున కవిత ఇంటికి వచ్చారు. అసలే అసెంబ్లీ ఎన్నికల్లో అట్టర్ ప్లాప్ అయిన బీఆర్ఎస్.. పార్లమెంట్ ఎన్నికల్లో పరువు నిలుపుకోవడానికి అహర్నిశలు కష్టపడుతోంది. ఈ పరిస్థితుల్లో కవిత అరెస్ట్.. పార్టీకి పెద్ద మైనస్‌గా మారే ఛాన్స్ ఉంది. అయితే.. ఇది కూడా ఎన్నికల్లో సింపతీ కోసమే పనికొస్తుందని మరోవైపు ప్రచారం కూడా జరుగుతోంది.

Kavitha Arrested:

Kavitha Arrested In Delhi Liquor Case
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs