Advertisement
Google Ads BL

వెంకీ ఇంట పెళ్లి వేడుకల్లో నమ్రత, సితార


విక్టరీ వెంకటేష్ ఇంట పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా మొదలైపోయాయి. గత రాత్రి వెంకటేష్ చిన్న కుమార్తె హయవాహిని పెళ్లి వేడుకల్లో భాగంగా మెహిందీ ఫంక్షన్ గ్రాండ్ గా నిర్వహించింది దగ్గుబాటి ఫ్యామిలీ. హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్ లో పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. హయవాహిని ఎంగేజ్మెంట్ గత ఏడాది అక్టోబర్ లో చాలా సింపుల్ గా జరిగింది. ఆ వేడుకకు చిరంజీవి, మహేశ్ బాబు హాజరయ్యారు. 

Advertisement
CJ Advs

అయితే దగ్గుబాటి కుటుంభ సభ్యులు హల్ది, మెహందీ వేడుకలకు సంబంధించిన ఫోటోలు ఏవీ లీక్ కాకుండా జాగ్రత్తపడ్డారు. తాజాగా మహేశ్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్, ఆయన కుమార్తె సితారలు మెహందీ సెలబ్రేషన్స్ లో పాల్గొన్న ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి మంచి సమయం గడిపానంటూ పెళ్లికూతురు, పెళ్లికొడుకుతో కలిసి ఫొటోలకి ఫోజులిచ్చారు నమ్రత. మరి వెంకటేష్ - మహేష్ బాబుకీ మధ్యన సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు దగ్గర నుంచి మంచి అనుబంధమే ఉంది.

ఈరోజు హయవాహిని పెళ్లి జరగనుంది. విజయవాడకు చెందిన ఓ డాక్టర్ తో పెళ్లి జరగనుంది. ఈ పెళ్లికి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరవుతున్నట్టుగా సమాచారం. 

Namratha and Sitara attends Venkatesh Daggubati second daughter wedding.:

Venkatesh Daggubati prepares to celebrate his second daughter wedding
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs