హనుమాన్ మేకర్స్ ఓటీటీ ఆడియన్స్ ని పదే పదే మోసం చేస్తూనే ఉన్నారు, హనుమాన్ థియేటర్స్ లో విడుదలై రెండు నెలలు పూర్తయినా ఇంకా ఓటీటీ రిలీజ్ పై మేకర్స్ క్లారిటీ ఇవ్వకుండా నాన్చుతూనే ఉన్నారు. తేజ సజ్జ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈచిత్రం థియేటర్స్ లో బిగ్గెస్ట్ హిట్ అవడంతో ఓటీటీ రిలీజ్ పై అందరిలో విపరీతమైన క్యూరియాసిటీ మొదలైంది. థియేటర్స్ లో చూసిన ప్రేక్షకులు మళ్ళీ ఓటీటీలో చూడాలనే ఇంట్రెస్ట్ తో ఉన్నారు.
మార్చ్ 8 న హనుమాన్ ఓటీటీ రిలీజ్ ఉంటుందిది అనుకుంటే అప్పుడు లేదు, కనీసం ఈ వారమైన హనుమాన్ ఓటీటీ నుంచి ఆడియన్స్ ముందుకు వస్తుంది అనుకున్నారు. అయితే ముందుగా హనుమాన్ హిందీ స్ట్రీమింగ్ డేట్ కన్ఫర్మ్ కాగా తెలుగు ఆడియెన్స్ కి ఇంకా ఎదురు చూపులు తప్పలేదు. నిన్న గురువారం ఎట్టకేలకి జీ 5 వారు హనుమాన్ ఓటీటీ రిలీజ్ పై అప్డేట్ ఇచ్చారు. దీనితో ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న వారు ఇప్పుడు బాగా డిజప్పాయింట్ అయ్యారు.
ఆల్రెడీ చాలా వెయిట్ చేస్తుంటే తీరా డేట్ ఇస్తారు అనుకునే సమయంలో ఇంకా అతి త్వరలో అంటూ మెన్షన్ చేయడం బాలేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క హనుమాన్ ఓటీటీ స్ట్రీమింగ్ జాప్యం ఉద్దేశపూర్వకంగా జరిగినది కాదు! అంటూ ప్రశాంత్ వర్మ సోషల్ మీడియాలో ట్వీట్ చెయ్యడంతో నెటిజెన్స్ కాస్త కూల్ అవుతున్నారు