Advertisement
Google Ads BL

చరణ్ కి చుక్కలు చూపించిన అభిమానులు


గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి ఉన్న అభిమాన గణం కొలతల్లో కొలవడం కష్టం. మెగాస్టార్ చిరు, పవన్ కళ్యాణ్, చరణ్ వీళ్లందరినీ మెగా అభిమానులే మోస్తూ ఉంటారు. మరి స్టార్ హీరోస్ కి అభిమానులే బలం, బలగం. హీరోలు ఎక్కడైనా కనబడితే చాలు ఫోటోలు తీస్తూ ఉత్సాహం చాటుకుంటారు. ఈమధ్యన సెల్ఫీల మోజు ఎక్కువయ్యాక స్టార్ హీరోస్ తో సెల్ఫీలు దిగేందుకు తోసుకుంటూ హీరోలని ఇబ్బంది పెట్టేస్తున్నారు. తాజాగా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ షూటింగ్ కోసం వైజాగ్ వెళ్ళాడు. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో దిగాడు.

Advertisement
CJ Advs

హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో నిన్న రాత్రి  విశాఖ లో దిగిన రామ్ చరణ్ కి భారీ సంఖ్యలో విశాఖ విమానాశ్రయం చేరుకొని ఘన స్వాగతం పలికారు అభిమానులు. మరి తాము ఆరాధించే హీరో కనిపిస్తే ఆగుతారా.. ఆ ఎయిర్ పోర్ట్ లో చరణ్ ని చూడగానే అభిమానులు రెచ్చిపోయారు. జై రామ్ చరణ్, జై మెగా పవర్ స్టార్ అంటూ నినాదాలు చేస్తూ చరణ్ ని చుట్టూ ముట్టేశారు. రామ్ చరణ్ తో ఫొటోస్ దిగేందుకు ఎగబడ్డారు. అభిమానులకి అభివాదం చేస్తూనే రామ్ చరణ్ వారిని తోసుకుంటూ కారు వద్దకు వచ్చేసినా అభిమానులు ఆయన్ని వదల్లేదు.

రామ్ చరణ్ బౌన్సర్లు ని తోసుకుంటూ కారు ఎక్కుతున్న వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వీడియో చూసిన వారు రామ్ చరణ్ కి ఆయన అభిమానులే చుక్కలు చూపించారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక విశాఖ విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన నగరంలోని రాడిసన్ బ్లూ హోటల్ కి బయలుదేరి వెళ్లిన చరణ్ వైజాగ్ లో జరగనున్న గేమ్ ఛేంజర్ షూటింగ్ లో పాల్గొననున్నారు.

Ram Charan fans showed love:

Ram Charan at Vizag Airport
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs