పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ ఎంత మంచి దోస్తులో వేరే చెప్పక్కర్లేదు. సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ లు స్నేహం గురించి మాట్లాడుకోని వారే ఉండరు. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్ళాక త్రివిక్రమ్ కి పవన్ దూరం జరిగారని అనుకున్నారు. కానీ త్రివిక్రమ్ పవన్ ని ఎక్కడా ఒంటరిగా వదల్లేదు. ఆయన రాజకీయ స్పీచ్ లని రెడీ చేస్తూ పవన్ కళ్యాణ్ మాటల్లో కనిపిస్తున్నారు. త్రివిక్రమ్ నాకు సహాయం చెయ్యడం లేదు అన్నప్పటికీ పవన్ కళ్యాణ్ మాట్లేడే ప్రతి మాట త్రివిక్రమ్ కలం నుంచి జారువారినదే.
ఈమధ్యన పవన్ కళ్యాణ్-చంద్రబాబు కలిసి ప్రజల్లోకి వెళ్లి మీటింగ్ పెట్టినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడిన ప్రతి అక్షరం త్రివిక్రమ్ వ్రాసినదే. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ మరోసారి త్రివిక్రమ్ గురించి మాట్లాడారు. అంతేకాకుండా నా అభిమానులు అందరు ఎక్కువ శాతం YCPకి ఓటు వేశారు.. కామెరా మ్యాన్ గంగతో రాంబాబు సినిమాలో ఒక సీన్ ఉంటది మీరందరు రండి అని, చాలామంది అనుకోవచ్చు సినిమాల వరకు సాధ్యం కానీ నిజ జీవితంలో జరుగుద్దా అని.. అది పవన్ కళ్యాణ్ జీవితంలో అయితే జరుగుద్ది! అంటూ మాట్లాడారు.
ఆయన తాజాగా పిఠాపురం నియోజక వర్గం నుంచి పవన్ పోటీ చేస్తున్నట్లుగా ప్రకటించిన క్రమంలో అక్కడ టీడీపీ కార్యకర్తలు రచ్చ రచ్చ చేసి అగ్గి రాజేశారు. అదలాఉంటే పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ గురించి మాట్లాడుతూ నేను సమాజం కోసం నేను ఆలోచిస్తే.. త్రివిక్రమ్ నా గురించి ఆలోచిస్తారు, నేను రాజకీయాల్లోకి రావడం త్రివిక్రమ్ గారికి అస్సలు ఇష్టం లేదు, నన్ను ఆపాలని చూసారు, నేనింకా రెచ్చిపోయాను అంటూ త్రివిక్రమ్ పై పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.