ఆర్.ఆర్.ఆర్ ని విడుదల చేసి మార్చ్ 26 కి ఖచితంగా రెండేళ్లు పూర్తవుతుంది. గత ఏడాది ఈ సమయంలో దర్శకుడు రాజమౌళి ఆస్కార్ హడావుడిలో ఉన్నారు. ఆర్.ఆర్.ఆర్ తర్వాత రాజమౌళి-మహేష్ బాబు కలయికలో మొదలు కాబోయే క్షణం కోసం మహేష్ అభిమానులే కాదు.. యావత్ ప్రపంచం ఎదురు చూస్తుంది. అందులో ఇంకాస్త ఎక్కువగా తెలుగు ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. రాజమౌళి SSMB 29 ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వున్నారు.. మహేష్ మాత్రం అటు SSMB29 కోసం మేకోవర్ అవడంతో పాటుగా.. యాడ్ షూట్స్ లో పాల్గొంటున్నారు.
అయితే మహేష్ చిత్రంపై రాజమౌళి ఇవ్వబోయే అప్ డేట్ కోసం నేషనల్ మీడియా మొత్తం క్యూరియాసిటీగా ఎదురు చూస్తుంది. మరి SSMB29 మొదలయ్యే ముందే రాజమౌళి తన హీరో మహేష్ బాబుని మీడియా ముందుకు తీసుకొచ్చి సినిమాకి సంబందించిన డీటెయిల్స్ ఇస్తారని ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. అదే ప్రెస్ మీట్ లో టైటిల్ కూడా ప్రకటించే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే SSMB29 కి మహారాజా, చక్రవర్తి పేర్లు ఆల్రెడీ ప్రచారంలోకి వచ్చాయి. ఇందులో ఏదో ఒకటి ఫైనల్ అంటున్నారు.
అయితే SSMB29 పై అప్ డేట్ వచ్చేది, ఈ ప్రాజెక్ట్ పై తీపి కబురు అందేది ఏప్రిల్ ఉగాది రోజు అని తెలుస్తుంది. SSMB29 అప్ డేట్ లో ఈ చిత్రంలో నటించబోయే నటులు, అలాగే సాంకేతిక నిపుణులని కూడా రాజమౌళి ప్రకటించే అవకాశం లేకపోలేదు అంటున్నారు. ఇక ఉగాది రోజున నేషనల్ మీడియాలో SSMB29 పై రాబోయే అప్ డేట్ సంచలనంగా మారేలా రాజమౌళి అండ్ కో ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.