Advertisement
Google Ads BL

లోకేష్ కనగరాజ్ తో ప్రభాస్ ఫిక్సా?


ఖైదీ, విక్రమ్ చిత్రాలు తర్వాత తమిళ స్టార్ డైరెక్షర్ లోకేష్ కనగరాజ్ పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోయింది. ఆ చిత్రాలు తర్వాత లోకేష్ తో టాలీవుడ్ స్టార్ హీరోలు సినిమాలు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం జరిగింది. కానీ లోకేష్ కనగరాజ్ మాత్రం టాలీవుడ్ హీరోలవైపు చూడడం లేదు. తమిళ స్టార్స్ తోనే సినిమాలు చేస్తున్నాడు. లోకేష్ యూనివర్స్ అంటూ క్రేజీ గా ఓ పేరు పెట్టి ఖైదీ, మాస్టర్, విక్రమ్, విజయ్ తో చేసిన లియో వరకు కనెక్షన్ ఇచ్చుకుంటూ ఖైదీ 2, విక్రమ్ 2, లియో 2 అంటూ ప్రాజెక్ట్ లని క్రియేట్ చేసుకుంటూ పోతున్నాడు. 

Advertisement
CJ Advs

కాకపోతే లోకేష్ కనగరాజ్ ప్రభాస్ తో డేట్స్ కోసమైతే చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడట, అయితే ప్రభాస్ తో చేయాలని తనకు ఉంది అని ప్రస్తుతం ప్రభాస్ చాలా బిజీగా ఉన్నాడు అని లోకేష్ కనగరాజ్ పలు సందర్భాల్లో తెలిపాడు. కానీ ఇప్పుడు లోకేష్ కనగరాజ్ పుట్టిన రోజు మార్చ్ 14 సందర్భంగా లోకేష్ కనగరాజ్ తో ప్రభాస్ సినిమా చెయ్యబోతున్నాడు, త్వరలోనే ఈ క్రేజీ ప్యాన్ ఇండియా స్టార్స్ ప్రాజెక్ట్ పై అనౌన్సమెంట్ వస్తుంది అంటూ చెబుతున్నారు.

ఒకవేళ లోకేష్ కి ప్రభాస్ డేట్స్ దొరక్కపోతే ఈలోపు రామ్ చరణ్, లేదంటే ఎన్టీఆర్ ఇలా ఏ హీరో దొరికినా ఈసారి టాలీవుడ్ లో ఓ క్రేజీ సినిమా చెయ్యాలని అనుకుంటున్నట్లుగా కోలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. 

Prabhas Fix with Lokesh Kanagaraj?:

Director Lokesh Kanagaraj To Team Up With Prabhas? 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs