Advertisement
Google Ads BL

బాలయ్య-బోయపాటి కాంబో ముహూర్తం


బాలయ్య-బోయపాటి అనగానే సింహ, లెజెండ్, అఖండ హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ గుర్తుకు వస్తాయి. అందుకే వీరి కలయికలో మరో ప్రాజెక్ట్ అనగానే అంచనాలు ఆకాశంలోనే ఉంటాయి. గీత ఆర్ట్స్ బ్యానర్ లో మొదటిసారి బాలకృష్ణ సినిమా చెయ్యడానికి రంగం రెడీ అవుతుంది. ఆహా ఓటీటీ టాక్ షో తర్వాత అరవింద్ తో బాగా క్లోజ్ అయిన బాలయ్య వారి బ్యానర్ లో సినిమాకి ఓకె చేశారు. బోయపాటి కూడా స్కంద గీత ఆర్ట్స్ బ్యానర్ లో సినిమా అనౌన్స్ చేసాడు. అయితే బాలయ్యతో బోయపాటి అఖండ సీక్వెల్ చేస్తారా.. లేదంటే కొత్త కథతో  సినిమా చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.

Advertisement
CJ Advs

ప్రస్తుతం బాలకృష్ణ దర్శకుడు బాబీతో NBK109 చేస్తున్నారు. ఆ చిత్రానికి సంబందించిన షూటింగ్ అప్ డేట్ లేకపోయినా రీసెంట్ గా వచ్చిన NBK 109 గ్లిమ్ప్స్ సోషల్ మీడియాని ఊపేసాయి. దానితో బాలయ్య తదుపరి ప్రాజెక్ట్ ఎవరితో చేస్తారనే క్యూరియాసిటీ ఎక్కువైంది. NBK110 ని బోయపాటి తోనే బాలకృష్ణ మొదలు పెడతారట. కానీ అది ఎప్పుడు అనేది ప్రస్తుతం ఏపీ ఎన్నికలు డిసైడ్ చేస్తుంది అంటున్నారు. బాబీ సినిమా షూటింగ్, అటు ఏపీ ఎన్నికల హడావుడితో బాలయ్య బాగా బిజీ.

అయినప్పటికీ బాలయ్య-బోయపాటి ప్రాజెక్ట్ ఉగాది రోజున ముహూర్తం పెట్టుకోబోతుంది అని టాక్. రెగ్యులర్ షూటింగ్ ఎంత ఆలస్యంగా మొదలుపెట్టినా ముందైతే పూజా కార్యక్రమాలు చేద్దామనే నిర్ణయానికి రావడంతో బాలయ్య ప్రస్తుతం మంచి ముహూర్తం సెట్ చేసే పనిలో ఉన్నారని సమాచారం

Balayya-Boyapati combo muhurtham is coming:

Balayya-Boyapati combo fix
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs