Advertisement
Google Ads BL

బంగారం బ్యూటీ పెళ్లయిపోయింది


పవన్ కళ్యాణ్‌తో బంగారం చిత్రంలో కలిసి నటించిన మీరా చోప్రా ఆ తర్వాత ఒకటిరెండు చిత్రాలు చేసినా కలిసిరాక ఆపై ఆమె టాలీవుడ్‌లో కనిపించింది లేదు. ఆమె చేసిన తెలుగు చిత్రాలు వరసగా డిజాస్టర్స్ అవడంతో తమిళనాట నిలదొక్కుకుందామని అక్కడ సినిమాలు చేసింది. ప్రియాంక చోప్రా కజిన్ సిస్టర్ అయిన మీరా చోప్రా హిందీ సినిమాలు చేసినా అనుకున్నంత ఫేమ్ దక్కించుకోలేక నటనకు దూరంగా ఉండిపోయింది. ఇక గత ఏడాది క్రిస్టమస్ సందర్భంగా తన బాయ్ ఫ్రెండ్‌ని పరిచయం చేసింది.

Advertisement
CJ Advs

అంతేకాకుండా బాయ్ ఫ్రెండ్ రక్షిత్‌ని వివాహం చేసుకుంటాను అని ప్రకటించడమే తరువాయి.. నిన్న మంగళవారం మార్చి 12న మీరా చోప్రా వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. రక్షిత్‌తో ఏడడుగులు వేసి మూడు ముళ్ళు వేయించుకున్న మీరా చోప్రా ఆ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది. మీరా చోప్రా పెళ్లి ఫొటోస్‌ని సోషల్ మీడియాలో చూసిన ఆమె అభిమానులు ఈ జంటకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మీరా చోప్రా-రక్షిత్ జంట చాలా బాగుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మోడల్‌గా కెరీర్‌ని ప్రారంభించిన మీరా చోప్రా.. 2005లో అన్బే ఆరుయిరే అనే తమిళ సినిమాతో నటిగా అరంగేట్రం చేసింది. టాలీవుడ్‌లో పవన్ కళ్యాణ్ బంగారం సినిమాలో నటించిన ఈ భామ.. ఆ తర్వాత వాన, మారో, గ్రీకు వీరుడు వంటి చిత్రాలలో నటించింది.

Bangaram Fame Meera Chopra Weds Rakshit Kejriwal:

Meera Chopra and Rakshit Kejriwal Share First Wedding Photos After They Tied the Knot in Jaipur  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs