కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ప్యాన్ ఇండియా ఫిలిం దేవర చిత్ర షూటింగ్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలో వేసిన స్పెషల్ సెట్ లో జరుగుతోంది. ఈమూవీకి విఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువగా ఉండడంతో ఎక్కడా క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా హాలీవుడ్ రేంజ్ అవుట్ ఫుట్ అందించేందుకు టీమ్ ఎంతో శ్రమిస్తోందట. అందుకే ఏప్రిల్ 5 న విడుదల సాధ్యమవ్వదు అనే ఆలోచనతో సినిమాని అక్టోబర్ 10 కి రిలీజ్ చేయాలనుకుని డేట్ లాక్ చేసారు.
ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్ విలన్ రోల్ పోషిస్తున్నారు. ఈ చిత్రంలో యాక్షన్ ఎపిసోడ్ హైలెట్ అవుతాయని, ఎన్టీఆర్ ఉగ్రరూపం చూస్తారని మొదటి నుంచి చిత్ర బృందం చెబుతుంది. ఆర్.ఆర్.ఆర్ చిత్ర హిట్ కి ఏమాత్రం తగ్గకుండా దేవర ఉంటుంది అంటున్నారు. ఇక అనిరుధ్ రవిచంద్రన్ కూడా అదిరిపోయే BGM ని సిద్ధం చేస్తున్నాడని అంటున్నారు. ఎటు చూసినా దేవరపై అంచనాలు భీభత్సంగా కనిపిస్తున్నాయి.