Advertisement
Google Ads BL

రేటింగ్స్ పై ఫైర్ అవుతున్న విశ్వక్ సేన్


సినిమా విడుదలయిన మరుక్షణం నుంచే సినిమాపై కొంతమంది విషం ఛిమ్మెందుకు సోషల్ మీడియాని వేదికగా చేసుకుంటున్నారు. పర్టిక్యులర్ గా కొంతమంది హీరోలని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా నెగెటివ్ రివ్యూస్ ఇస్తూ ఆ సినిమాలని చంపేస్తున్నారు. సోషల్ మీడియాలో సినిమా బాగోలేదని పోస్టులు చేయడం, బుక్ మై షో లాంటి ప్లాట్ ఫార్మ్స్ లో టెక్నాలజీ వాడి సినిమాలకు 0 లేదా 1 రేటింగ్ ఇవ్వడం వంటివి చేస్తున్నారు. పనిగట్టుకుని ఆయా హీరోలని బ్యాడ్ చేసే క్రమంలో సినిమాలపై నెగెటివ్ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు.

Advertisement
CJ Advs

ఈ మధ్యన మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాకు కూడా కావాలని కొంతమంది బుక్ మై షోలో 1 రేటింగ్స్ ఇచ్చారు. కానీ ఆ సినిమా ప్రేక్షకులకు నచ్చడంతో మంచి విజయం సాధించింది. ఇప్పుడు మరో హీరో విశ్వక్ సేన్ నటించిన గామి సినిమాకు కూడా ఇదే రకమయిన నెగెటివ్ ప్రచారం చేస్తున్నారు. గత శుక్రవారం విశ్వక్ సేన్ గామి సినిమా రిలీజయింది. ఓ ప్రయోగాత్మక చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన గామి బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకోకపోయినా..  మంచి విజయం సాధించి ఆల్రెడీ అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ కూడా అయ్యింది. 

అయితే విశ్వక్ సేన్ అంటే నచ్చనివాళ్ళు కొంతమంది ఈ సినిమాకు బుక్ మై షోలో 0 మరియు 1 రేటింగ్ కావాలని ఇవ్వడంపై విశ్వక్ సీరియస్ గా స్పందించాడు. విశ్వక్ సేన్ గామి సినిమా హిట్ అయినందుకు ఆడియన్స్ కి థ్యాంక్స్ చెప్తూ, ఈ ఇష్యూపై కూడా స్పందిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్ లో.. గామి సినిమాకు ఇంత పెద్ద విజయం అందించినందుకు ఆడియన్స్ కి, సినిమా లవర్స్ కి నా కృతజ్ఞతలు. నా దృష్టికి వచ్చిన ఒక సమస్య గురించి మాట్లాడదాం అనుకునున్నాను. 

సినిమాల మీద పర్సనల్ అటాక్స్, బుక్ మై షో లాంటి వాటిల్లో 1 రేటింగ్ ఇచ్చి సినిమాని దెబ్బ తీయడం లాంటిది చేస్తున్నారు కొంతమంది. మీరు ఫేక్ రేటింగ్స్ ఇవ్వడం వల్ల సినిమాకు నిజంగా మంచి రేటింగ్స్ వచ్చినా, ప్రేక్షకులు బావుంది అన్నా అవి పడిపోతున్నాయి. మీరు నన్ను ఎన్నిసార్లు కిందకి లాగినా నేను చాలా డేంజర్ గా పైకి వస్తాను. ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నారో నాకు తెలీదు. కానీ ఇలాంటి సమయంలో మంచి సినిమా వస్తే సపోర్ట్ చేసిన ఆడియన్స్ కి, మీడియాకు, క్రిటిక్స్ కు ధన్యవాదాలు. ఈ ఇష్యూపై నేను త్వరలోనే లీగల్ గా ముందుకు వెళ్తాను అంటూ ఘాటుగా స్పందించాడు.

Vishwak Sen fire on book my show rating:

Vishwak Sen thanks viewers for Gaami
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs