Advertisement
Google Ads BL

షాకింగ్: సత్యం దర్శకుడు సూర్య కిరణ్ మృతి


టాలీవుడ్ లో సత్యం, ధన 51 చిత్రాలతో దర్శకుడిగా ఫేమస్ అయిన  డైరెక్టర్ సూర్యకిరణ్ మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం తుది శ్వాస విడిచారు. సూర్య కిరణ్ వయసు 51 సంవత్సరాలు. ఆయన కంటికి పచ్చ కామెర్లు రావడంతో సూర్య కిరణ్ చికిత్స తీసుకుంటున్నప్పటికీ.. పరిస్థితి విషమించి ఈరోజు మృతి చెందినట్లుగా కుటుంభ సభ్యులు తెలిపారు. సూర్య కిరణ్ లేడన్న వార్త సినీ ప్రముఖుల్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. సూర్య కిరణ్ ఆత్మకు శాంతి కలగాని కోరుకంటున్నారు. 

Advertisement
CJ Advs

దర్శకుడు సూర్య కిరణ్ చాలా కాలంగా డైరెక్షన్ ఫీల్డ్ కి దూరంగా ఉన్నారు. బిగ్ బాస్ సీజన్-4లో కంటెస్టెంట్ గా వ్యవహరించి తొందరగానే హౌస్ నుంచి బయటకొచ్చాడు. సూర్య కిరణ్ నటి కల్యాణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత అనేక కారణాల వల్ల వీళ్లిద్దరూ విడిపోయారు. కల్యాణీ తనకు దూరమైనప్పటికీ... ఆమె అంటే తనకు ఇష్టమని, ఆమెను తాను ప్రేమిస్తున్నానని సూర్య కిరణ్ ఒకట్రెండు సందర్భాల్లో చెప్పారు. సూర్య కిరణ్ సిస్టర్ సుజిత కూడా బుల్లితెర నటి.

ఒక వైపు విజయాలు లేకపోవడం, మరో వైపు వైవాహిక జీవితంలో పలు సమస్యల కారణంగా ఆయన మెగాఫోన్ పక్కన పెట్టేశారని చెప్పుకునేవారు. డైరెక్టర్ సూర్య కిరణ్ అంత్యక్రియలు రేపు అనగా మంగళవారం చెన్నైలో జరుగుతాయి అని కుటుంభ సభ్యులు తెలిపారు.

Director Surya Kiran Passes Away:

Surya Kiran Passes Away At 51
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs