Advertisement
Google Ads BL

ఏది చెయ్యాలనుకుంటే అది చేస్తా: మెగా డాటర్


మెగా డాటర్ నిహారిక భర్త చైతన్య తో విడిపోయాక తన తల్లితండ్రులతో కలిసి ఉంటోంది. అన్న వరుణ్ తేజ్ పెళ్లి తర్వాత నిహారిక సపరేట్ గా వెళ్ళాలి అనుకుంటుంది, అందుకు తగ్గట్టుగా ఆమె ఓ ఇంటిని రెడీ చేసుకుంటుంది అనే ప్రచారం ఉండగా.. నిహారిక ప్రస్తుతం ఇండస్ట్రీలో బిజీగా మారింది. నిర్మాతగా, నటిగా నిహారిక ఇకపై తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవడానికి సిద్ధమైంది. తాజాగా నిహారిక ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలని పంచుకుంది.

Advertisement
CJ Advs

తనకి ఈమధ్యన ఆకలి పిచ్చి ఎక్కువైంది, ఏదైనా విపరీతంగా తినేస్తున్నాను, పప్పు చారు నా ఫేవరేట్ అంటూ చెప్పిన నిహారిక తాను కొద్దిగా డబ్బు కూడబెట్టుకుంటూ మరీ ప్రయాణాలు ఎక్కువగా చేస్తున్నాను, నేను ఏది ప్లాన్ ప్రకారం చెయ్యను, ఏది చేయాలనుకుంటే అది చేస్తాను, నాకు నటన అంటే ఇష్టం, ఇప్పటివరకు నేను సినిమాల్లో నటించిన  పాత్రలన్నీ నాకు నచ్చే చేశాను, నాకు ఇప్పటివరకు కమర్షియల్ సినిమాల్లో నటించే అవకాశం రాలేదు. నన్నెప్పుడు పెద్ద డైరెక్టర్స్ అప్రోచ్ అవ్వలేదు. ఒకవేళ వాళ్ళు నన్ను అడిగితే ఒప్పుకునేదాన్ని.

నాకు ఆడిషన్స్ అంటే ఇష్టం, పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చా ఆడిషన్స్ చెయ్యను అనను, నన్ను ఆడిషన్ కి పిలిస్తే వెళ్లి ఇచ్చోస్తాను, నేను కుకింగ్ ప్రోగ్రాం చేస్తున్నాను, దీని కోసం నాన్నమ్మ, పెద్దమ్మ సురేఖ, వదిన ఉపాసనలని తీసుకొచ్చి ఓ ఎపిసోడ్ చేయాలనుకుంటున్నాను, చూద్దాం ఏం జరుగుతుందో అంటూ నిహారిక చెప్పుకొచ్చింది. 

Niharika interview:

Niharika interview about career 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs