Advertisement
Google Ads BL

NBK109 పై అంచనాలు పెంచేసిన బ్యూటీ


నందమూరి బాలకృష్ణ-కొల్లి రవీంద్ర కాంబోలో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న NBK109 మూవీ పై మహాశివరాత్రి రోజున మేకర్స్ వదిలిన గ్లిమ్ప్స్ ఒక్కసారిగా అంచనాలు పెంచేసాయి. సినిమా మొదలైన కొత్తలో వరసగా అప్ డేట్స్ వదులుతూ ప్రీ లుక్ పోస్టర్స్ తో హైప్ క్రియేట్ చేసిన మేకర్స్ మళ్ళీ మహాశివరాత్రికి వదిలిన గ్లిమ్ప్స్ మాత్రం నందమూరి అభిమానులకే కాదు కామన్ ఆడియన్స్ కి కూడా పూనకాలు తెప్పించింది. దానితో ఈ చిత్రం పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.

Advertisement
CJ Advs

ఇక NBK109 లో హీరోయిన్ విషయం తేలకపోయినా.. ఈ చిత్రంలో ఊర్వశి రౌతేల్ల కీలక పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఊర్వశి రౌతేల్ల ఈ చిత్రం పై ఇచ్చిన క్రేజీ అప్ డేట్ చూస్తే నందమూరి అభిమానులకి మతి పోతుంది. ఊర్వశి రౌతేల్ల తన ఇన్స్టాగ్రామ్ లో బాలయ్య 109 పాన్ ఇండియా సినిమా అంటూ కన్ఫర్మ్ చేస్తూ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారగా.. NBK109 పాన్ ఇండియా ఫిలిం అనే విషయంలో మేకర్స్ సైడ్ నుంచి ఇంకా ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు.

కానీ ఊర్వశి మాత్రం తన నెక్స్ట్ సినిమా బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా అంటూనే.. బాలయ్య 109 గ్లింప్స్ యూట్యూబ్ లో నెంబర్ 1 ప్లేస్ లో ట్రెండ్ అవుతుంది అని చెప్పడంతో అందరూ సర్ ప్రైజ్ అవుతున్నారు. అయితే రేపు రాబోయే ఉగాదికి NBK109 టైటిల్ రివీల్ చెయ్యడంతో పాటుగా ఈ చిత్రానికి సంబందించిన రిలీజ్ డేట్ కూడా మేకర్స్ లాక్ చేయబోతున్నారనే టాక్ నడుస్తుంది. 

Urvasi that raised expectations on NBK109:

Balakrishna NBK 109 sparks pan-Indian film speculations
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs