ఏపీ ఎలక్షన్స్ లో టీడీపీ తో అలాగే బీజేపీతో పొత్తుపెట్టుకుని నిలబడాలని పవన్ కళ్యాణ్ ఎప్పుడో ఫిక్స్ అయ్యారు. సీట్ల పంపకంలో తేడాలు వస్తాయి, అటు బీజేపీ తో కలవాల్సి వస్తుంది అని టీడీపీ జనసేనలో కలవడానికి వెనకడుగు వేసింది. పవన్ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా టీడీపీ ని కలుపుకోవాలని ట్రై చేసారు. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు ఆయన్ని కలిసొచ్చి మీడియా ముఖంగా టీడీపీ-జనసేన కలసి ఏపీ ఎలక్షన్స్ లో పోటీ చేస్తుంది అని ప్రకటించారు.
ఆ తర్వాత కూడా టీడీపీ జనసేనతో అంటి ముట్టనట్టుగానే ఉంది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం వదలకూండా టీడీపీ వెంటపడ్డారు. చంద్రబాబు ఇంటికెళ్లి మీటింగ్ లు పెట్టారు. మరోపక్క పవన్ కళ్యాణ్ బీజేపీ తో దోస్తీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీ-బీజేపీ కలిసే పరిస్థితి లేదు. అందుకే పవన్ మధ్యవర్తిత్వం చేపట్టి వీరి కలయిక కోసం ఢిల్లీ చుట్టూ తిరిగారు. అమిత్ షా తో భేటీ అవుతూ టీడీపీ తో పొత్తు వలన కలిగే ప్రయోజనాలు వివరిస్తూ సీట్ల పంపకాలపై అవసరమైతే జనసేన కాంప్రమైజ్ అయ్యేలా ఒప్పించడంలో కీలక పాత్ర వహించారు.
గత రెండు రోజులుగా చంద్రబాబుతో కలిసి పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దల చుట్టూ తిరుగుతూ టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుపై క్లారిటీ వచ్చేలా చేసారు. ఫైనల్ గా ప్రజా సంక్షేమం కోసమే బీజేపీతో ఈ పొత్తు అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మాట్లాడేలా చెయ్యడంలో పవన్ పాత్ర ఎంత ఉందో అందరికి తెలుసు. పొత్తుకు విముఖంగా ఉన్న టీడీపీ, బీజేపీ లని ఒక తాటిపైకి తీసుకురావడంలో పవన్ కళ్యాణ్ ఎంతో కష్టపడ్డారు. ఆఖరుకి టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు ఖరారైంది. వచ్చే ఎన్నికల్లో ముగ్గురూ కలిసి పోటీకి సిద్ధమ్మయ్యారు. చివరికి మోడీని కూడా ఏపీ ఎన్నికల సభలో టీడీపీ-జనసేనతో కలిసి వచ్చే ఏర్పాట్లు చేసుకుని రావడంలో పవన్ కృషి చెప్పనలవి కాదు.
అందుకే అనేది టీడీపీ-బీజేపీ-జనసేన దోస్తీకి కారణం పవన్ కళ్యాణ్ అని. ఈ పొత్తుకు కర్త, కర్మ, క్రియ ఆయనే అని.!