Advertisement
Google Ads BL

ఆ ఒక్కడి దెబ్బకు జగన్‌కు నిద్ర కరువు!


జగన్‌కు పక్కలో బల్లెంలా ఆ ఒక్కడు.. నిద్రపట్టనీయట్లే..

Advertisement
CJ Advs

ఏపీ సీఎం జగన్‌కు చుట్టూ సమస్యలే. ఏది ముట్టినా చిరిగి చాటంత అవుతోంది. ఒకవైపు చెల్లెళ్లు.. మరోవైపు రాజకీయ ప్రత్యర్థులు.. వీళ్లు చాలన్నట్టు ఎన్నికల స్ట్రాటజిస్ట్‌ కూడా తోడయ్యారు. పక్కలో బల్లెంలా మారి జగన్‌కు నిద్ర పట్టకుండా చేస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీకి ఎన్నికల స్ట్రాటజిస్ట్‌గా పని చేసిన ప్రశాంత్ కిషోర్ టైం దొరికితే చాలు.., షాకింగ్ విషయాలను రివీల్ చేసి జగన్‌కు ఊపిరాడకుండా చేస్తున్నారు. తాజాగా ఆయన మాట్లాడిన ఓ వీడియోను జనసేన పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియో చూసిన వారంతా షాక్ అవుతున్నారు. టీడీపీ - జనసేన పొత్తు కుదిరినప్పటి నుంచి పవన్‌ను వ్యక్తిగతంగానూ.. పార్టీ పరంగానూ ఇష్టానుసారంగా వైసీపీ విమర్శలు చేస్తోంది.

జనసేనతో పొత్తుకు యత్నం..

జనసేన టీడీపీల పొత్తును విడగొట్టేందుకు నానా విధాలుగా ట్రై చేసి చివరకు విసిగిపోయిన వైసీపీ సింహం సింగిల్‌గా వస్తుందని.. మాకు భయపడే పొత్తు పెట్టుకున్నారంటూ నానా యాగీ చేసింది. తాజాగా జనసేన సోషల్ మీడియా విభాగం ఓ వీడియోను బయటపెట్టింది. అది ప్రశాంత్ కిషోర్ మాటలకు సంబంధించిన వీడియో. ఎప్పుడు మాట్లాడారో ఎక్కడ మాట్లాడారో తెలియదు కానీ 2017లో నంద్యాల ఉపఎన్నికలో వైసీపీ ఓడిన తర్వాత.. పవన్ కల్యాణ్‌తో పొత్తు కోసం వైసీపీ ప్రయత్నించినట్టు ఆ వీడియోలో పీకే చెప్పారు. వేరొకరు చెబితే నమ్మకపోదురేమో కానీ అప్పట్లో ఆయన వైసీపీ ఎన్నికల స్ట్రాటజిస్టుగా ఉన్నారు కాబట్టి నమ్మక తప్పడం లేదు. అసలు ఏమైందో ఏమో కానీ పీకే మాత్రం వైసీపీపై విపరీతంగా విరుచుకుపడుతున్నారు. 

ఏమీ చేయలేని స్థితిలో వైసీపీ..

ఇప్పటికే వైసీపీ ఓటమి ఖాయమని తేల్చి చెప్పేశారు. ఈసారి ఎన్నికలలో ఎలాగైనా తిరిగి అధికారాన్ని దక్కించుకోవాలని వైసీపీ నానా తంటాలు పడుతుంటే.. పీకే మాత్రం ఎప్పటికప్పడు ఏదో ఒక బాంబ్ పేలుస్తూ వైసీపీ ఆశలపై నీళ్లు చల్లుతూనే ఉన్నారు. ఒకవైపు బీజేపీ కూడా పొత్తులో చేరుతోందని.. ఇక ముందు ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవల్సి వస్తుందోనని జగన్ ఆందోళన చెందుతున్నారు. బీజేపీతో పొత్తు ఫిక్స్ కాబట్టి ఇక జగన్ ఏపీలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని కూడా ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు. అన్ని విధాలుగా లాక్ అవుతున్నారు. పద్మవ్యూహం నుంచి నాడు అభిమన్యుడు ఎలా బయటపడలేదో.. ఇప్పుడు జగన్.. విపక్షాలు అల్లిన పద్మవ్యూహం నుంచి కూడా బయటపడటం కష్టమే.

Prashant Kishor vs YSRCP:

YSRCP highlights Prashant Kishor miscalculation in AP
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs