Advertisement
Google Ads BL

భారీ పారితోషకం డిమాండ్ చేస్తున్న యశ్?


కన్నడ స్టార్ హీరో, ప్యాన్ ఇండియా స్టార్ యశ్ KGF సీరీస్ తర్వాత మొదలు పెట్టబోయే కొత్త ప్రాజెక్ట్ పై సస్పెన్స్ వీడగా.. ఇప్పుడు ఆయన హిందీ రామాయణ లో రావణుడి పాత్ర చేయబోతున్నాడనే వార్త సినీ లవర్స్ ని ఎగ్జైట్ చేస్తుంది. హిందీలో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీత గా, రకుల్ ప్రీత్ సూర్పనఖ పాత్రలో, నవీన్ పోలిశెట్టి లక్షణుడిగా నటించనున్న ఈ చిత్రంలో యశ్ రావణ్ పాత్రని పోషించబోతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. ఈ విషయమై అఫీషియల్ క్లారిటీ లేదు.

Advertisement
CJ Advs

అయితే ఈ చిత్రంలో నెగెటివ్ రోల్ చేస్తున్నందుకు గాను యశ్ ఏకంగా 150 కోట్లు డిమాండ్ చేసినట్టు బాలీవుడ్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి KGF తో పెరిగిన పాపులారిటీని యశ్ ఇలా యూస్ చేసుకుంటున్నాడు అంటూ గుసగుసలాడుకుంటున్నారు. విలన్ కేరెక్టర్ చేస్తుంటే ఆ మాత్రం తీసుకోకపోతే ఎలా అని యశ్ చెప్పినట్లుగా సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతోంది.

కానీ యశ్ సన్నిహిత వర్గాలు మాత్రం ఇదంతా రూమర్ మాత్రమే.. యశ్ ఎవ్వరిని ఎలాంటి డిమాండ్ చెయ్యలేదు, ఇలాంటి గాసిప్స్ నమ్మకండి అంటున్నారు. మరోపక్క యశ్ విలన్ కేరెక్టర్ లో రావణ్ గా నటించవద్దంటూ ఆయన అభిమానులు రచ్చ చెయ్యడం గమనార్హం. మరి యశ్ రామాయణ లో రావణ్ పాత్రలో కనిపిస్తాడో.. లేదంటే అభిమానుల కోసం వెనక్కి తగ్గుతాడో చూడాలి.

Is Yash demanding a huge remuneration?:

Yash Reportedly Demands ₹150 Crore To Play Ravan In Ramayan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs