భారీ బడ్జెట్ సినిమాలు, స్టార్ హీరోల సినిమాలు, 1000 కోట్లు కొల్లగొట్టిన సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ విషయంలో హనుమాన్ మేకర్స్ అంత అలోచించి ఉండరేమో. థియేటర్స్ లో విడుదలైన 20 రోజులకో, నెలకో ఓటీటీ స్ట్రామింగ్ కి వచ్చేస్తున్న టైమ్ లో హనుమాన్ విడుదలై రెండు నెలలు కావొస్తున్నా ఓటీటీ స్ట్రీమింగ్ పై ఇంకా సస్పెన్స్ కొనసాగిస్తూనే ఉన్నారు. జనవరి 12 న థియేటర్స్ లోకి వచ్చి మూడు వందల కోట్లు కొల్లగొట్టుకు పోయిన హనుమాన్ రీసెంట్ గానే 50 రోజులు పూర్తి చేసుకుని సెలెబ్రేషన్స్ చేసుకుంది.
అయితే నిన్న మార్చ్ 8 మహాశివత్రికి హనుమాన్ స్ట్రీమింగ్ జీ 5 లో ఉండొచ్చనే ప్రచారంతో ఉత్సాహపడిన ఓటీటీ ఆడియన్స్ ని మళ్ళీ డిస్పాయింట్ చేసారు. ఇప్పుడు ఫైనల్ గా హనుమాన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఏమో కానీ టీవీ ప్రీమియర్స్ ఫిక్స్ చేసుకుంది. ఈ చిత్రం ఈ మార్చ్ 16 నుంచి టీవీ లోకి వచ్చేందుకు సిద్ధం అయ్యింది. అయితే హనుమాన్ మేకర్స్ ఇక్కడ ఇచ్చిన ట్విస్ట్ ఏమిటంటే ఈ చిత్రం హిందీలో అది కూడా జియో సావన్ లో స్ట్రీమింగ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు.
కానీ హనుమాన్ మిగతా ప్యాన్ ఇండియన్ భాషల ఓటీటీ రిలీజ్ కి సంబంధించి ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.. మరి సౌత్ భాషల్లో కూడా అదే డేట్ లో జీ5 లో రావచ్చు. దీనిపై మాత్రం అఫీషియల్ క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇది ట్విస్ట్ కాక ఇంకేమిటి.