Advertisement
Google Ads BL

అందుకే జబర్డస్త్ మానేశా: సౌమ్య రావు


జబర్దస్త్ లోకి వచ్చాక చాలామంది పేరు, ఫేమ్, డబ్బు సంపాదించుకుని సెటిలయినవారు చాలామందే ఉన్నారు. కొంతమంది జబర్దస్హ్ కన్నా బెటర్ లైఫ్ కోసం జబర్దస్త్ ని వదిలేసినవారూ ఉన్నారు. ఇక అనసూయ అయితే జబర్దస్త్ తో పేరు ప్రతిష్టలు తెచ్చుకుని ఇప్పుడు వెండితెర అవకాశాల కోసం జబర్దస్త్ ని పక్కన పెట్టేసింది. దానితో ఎక్స్ట్రా జబర్దస్త్ కి యాంకర్ గా వచ్చే రష్మినే జబర్దస్త్ ఎపిసోడ్ ని కూడా హ్యాండిల్ చేసింది. రష్మీ తర్వాత ఆమె ప్లేస్ లోకి సీరియల్ నటి సౌమ్య రావు జబర్దస్త్ యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది.

Advertisement
CJ Advs

అనసూయ, రష్మీ అంత జోష్ లేకపోయినా, అంత గ్లామర్ లేకపోయినా.. సౌమ్య రావు యాంకర్ గా ఓ ఏడాది పాటు నెట్టుకొచ్చింది. అయితే ఈమధ్యన సౌమ్య రావు స్థానంలో బిగ్ బాస్ ఫేమ్ సిరి హన్మంత్ కనిపించేసరికి అందరూ షాకయ్యారు. సౌమ్య రావు ఏమైపోయింది అనుకున్నారు. తాజాగా సౌమ్య రావు జబర్దస్త్ ఎందుకు మానెయ్యాల్సి వచ్చిందో చెప్పింది. తనకి తెలుగు పెద్దగా రాదని, అంతేకాకుండా డాన్స్ స్టెప్స్ కూడా సరిగ్గా వెయ్యలేకపోవడంతో నేను డాన్స్ నేర్చుకోవడానికి వెళ్ళాను.

నేను సన్నగా ఉండడంతో డాన్స్ చెయ్యడం వలన మరింత సన్నగా మారిపోయాను. జబర్దస్త్ మేనేజర్ పిలిచి డాన్స్ చెయ్యకండి సన్నగా అయితే బాగోరు, డాన్స్ ఎలాగో మేనేజ్ చెయ్యొచ్చు అన్నారు. ఇక తెలుగు రాని కారణంగా కొన్ని స్కిట్స్ అర్ధమవక ఎంజాయ్ చెయ్యలేకపోయేదాన్ని.. తెలుగు రాకపోవడం, డాన్స్ రాని కారణంగానే తాను జబర్దస్త్ ని వీడినట్లుగా సౌమ్య రావు ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. 

Sowmya Rao Comments about Why She Leaving Jabardasth :

Anchor Sowmya Rao Comments about Why She Leaving Jabardasth 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs