కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ రెండు రోజుల క్రితం చెన్నై లోని ప్రవేట్ ఆసుపత్రిలో భార్య షాలిని తో కలిసి కనిపించడంతో ఆయన అభిమానులు చాలా ఆందోళనపడిపోయారు. అజిత్ ఎందుకు ఆసుపత్రికి వెళ్ళారా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. మరోపక్క అజిత్ చేస్తున్న విదాముయార్చి చిత్రం కోసం విదేశాలకి వెళ్లనున్నారు. అందుకే రొటీన్ హెల్త్ చెకప్ కి అజిత్ ఆసుపత్రికి వెళ్లరని అన్నారు. దానితో అజిత్ ఫాన్స్ కాస్త రిలాక్స్ అయ్యారు. అయితే అదే రోజు అజిత్ ఆసుపత్రి నుంచి డిశ్ ఛార్జ్ కాకపోవడంతో వారు మళ్ళీ టెన్షన్ పడ్డారు.
ఈలోపు అజిత్ కు బ్రెయిన్ సర్జరీ జరగిందని, వైద్యులు ట్యూమర్ తొలగించారనే వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. తాజా సమాచారం ప్రకారం అజిత్ కి జరిగింది బ్రెయిన్ సర్జరీ కాదని ఆయన అధికార ప్రతినిధి సురేశ్ చంద్ర తెలిపారు. చెవిని, మెదడును కలిపే నరం కొంచెం వాచిందని దానికి డాక్టర్స్ చిన్నపాటి ప్రొసీజర్ ద్వారా ట్రీట్మెంట్ చేశారని చెప్పారు.
ప్రస్తుతం అజిత్ ఆరోగ్యంగానే ఉన్నారని.. ఐసీయూ నుంచి ఆయన వార్డ్ కు నడుచుకుంటూ వెళ్లారని, ఆయన హెల్త్ విషయంలో ఎవరూ కంగారు పడవద్దని చెప్పారు. ఇక ఈరోజు అజిత్ పూర్తి ఆరోగ్యంతో చెన్నై ఆసుపత్రి నుంచి డిశ్ ఛార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయినట్లుగా తెలుస్తోంది.