మెగా హీరో సాయి ధరమ్ తేజ్ మరో మారు పేరు మార్చుకున్నాడు. గతంలో అంటే 2019 ఆ టైములో సాయి ధరమ్ తేజ్ ని కాస్తా సాయి తేజ్ గా మార్చుకున్న సాయి ధరమ్ ఇప్పుడు మరోమారు తన పేరు మార్చుకున్నట్టుగా ప్రకటించాడు. సత్య షార్ట్ ఫిలిం ప్రీమియర్స్ సందర్భంగా ఉమెన్స్ డే స్పెషల్ గా సాయి ధరమ్ తన పేరు మార్చుకున్న విషయాన్ని రివీల్ చేసాడు. తన తల్లి పేరు మీద దుర్గ ప్రొడక్షన్ బ్యానర్ ని స్థాపించిన సాయి తేజ్ అదే బ్యానర్ పై సోల్ అఫ్ సత్య అనే షార్ట్ ఫిలిం ని తెరకెక్కించాడు.
అదే తన తల్లి ఎప్పటికి తనతోనే ఉండాలనే కోరికతో తన పేరుని సాయి దుర్గ తేజ్ గా మార్చుకుంటున్నట్టుగా ప్రకటించాడు. అయితే సాయి ధరమ్ తేజ్ ఎన్నిసార్లు పేరు మార్చుకున్నా SDT మాత్రం కామన్ గా కంటిన్యూ అవుతుంది.
ఇక రామ్ చరణ్ తో సినిమా ఎక్స్ పెక్ట్ చెయ్యొచ్చా అన్నప్రశ్నకి మొన్న పవన్ కళ్యాణ్ గారితో చేశాను. అంతకుముందు నాగబాబు గారితో చేశాను.. ఇకపై చిరు మామతో నటించాలనే కోరిక ఉన్నట్టుగా చెప్పిన సాయి ధరమ్ తేజ్ చిరు మామతో ఆ కల నెరవేరాకే మిగతా వారితో స్క్రీన్ షేర్ చేసుకుంటాను అని చెప్పుకొచ్చాడు.