Advertisement
Google Ads BL

కేక పుట్టించి కాక రేపిన KALKI లుక్


ఇలాంటి శివరాత్రి కోసం ఎంతోకాలంగా ఎదురు చూస్తున్నాయి సినిమా సర్కిల్స్. 

Advertisement
CJ Advs

ఇదే శివరాత్రి కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు ప్రభాస్ ఫాన్స్. 

ఎట్టకేలకు ఆ పర్వదినం నేడు రానేవచ్చింది.

ఎక్స్ లెంట్ అనిపించే ప్రభాస్ లుక్ తో కల్కి పండగ చేసింది. 

కల్కి అనే సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే ఆకాశం వైశాల్యంతోను, సముద్రపు లోతుతోనూ పోల్చాల్సిన పరిస్థితి. ఇలా ఎందుకు అనాలంటే, ఇటీవలే సలార్ తో సంచలనం సృష్టించిన బాహుబలి ప్రభాస్ ఓ వైపు - తను అల్లాటప్పా సినిమాలు తీసే రకం కాదంటూ నిరూపించుకుంటోన్న మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ మరో వైపు - సినిమా నిర్మాణంలో చుక్కల్ని తాకే లెక్కల్ని కూడా లెక్క చెయ్యని అశ్విని దత్ వంటి అగ్ర నిర్మాత ఇంకో వైపు. 

ఈ ముగ్గురికి తోడు లోకనాయకుడు కమల్ హాసన్ కెరీర్ లోనే తొలిసారిగా నెగెటివ్ రోల్ చేస్తూ ఉండడం, ఆలిండియా స్టార్ అమితాబ్ కీలక రోల్ లో కనిపించనుండడం కల్కి హైప్ ని అసలెవరు ఊహించలేనంతగా పెంచేసింది. పైగా గ్లామర్ వైజ్ బాలీవుడ్ బ్యూటీస్ దీపికా పడుకొనే - దిశా పటాని దేదీప్యంగా ఉండనే ఉన్నారు. ఇది ఇక్కడితో ఆగలేదండోయ్.. ఇందులో అతిధిపాత్రలు చేస్తున్న ఎంతోమంది స్టార్స్ నేమ్స్ ఎప్పటికప్పుడు గాసిప్స్ రూపంలో వస్తూనే ఉన్నాయి. అందరిని ఇంకాస్త ఊరిస్తూనే ఉన్నాయి.

ఇక అసలు విషయానికి వస్తే, ప్రస్తుతం కల్కి కోసం ఇటలీలో ఓ క్రేజీ పెప్పి సాంగ్ కోసం దిశా పటానితో కలిసి స్టెప్పులేస్తున్న ప్రభాస్ శివ రాత్రి సందర్భంగా, కల్కి లో భైరవగా అందరి ముందుకు వచ్చారు. అద్భుతమైన లుక్ తో అంతా కళ్లప్పగించి చూసేలా చేసారు. నిజంగానే నేడు శివరాత్రి సందర్భంగా రిలీజ్ అయిన కల్కిలో భైరవ లుక్ ని చూసి అంతటా హర్షం వ్యక్తం అవుతోంది. అంతటా అంటే తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదండోయ్ దేశ వ్యాప్తంగా..!

అస్సలెవ్వరూ ఎక్స్ పెక్ట్  చెయ్యని విధంగా, నభూతో నభవిష్యత్ అనే రీతిలో నాగ్ అశ్విన్ కల్కిని మలుచుతున్నారనే కాన్ఫిడెన్స్ సినిమా వర్గాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. మహాభారత కాలం నుంచి మన భవిష్యత్ కాలం 2898 AD వరకు జరిగే ఈ కల్కి సందడి ప్రేక్షకులని సంబ్రమాశ్చర్యాలకు లోను చేస్తుందని యూనిట్ వర్గాలు స్ట్రాంగ్ గా చెబుతున్నాయి. మే 9 నుంచి థియేటర్స్ వద్ద దద్దరిల్లే ప్రభంజనానికి నేటి తన భైరవ లుక్ తో ప్రభాస్ తెర తీసాడని అనుకోవచ్చు. అశేష అభిమాన ప్రేక్షకులు కలిగిన ప్రభాస్ నుంచి మరో ఆల్ టైమ్ హిట్ ఆశించొచ్చు. 

(మగధీరతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన రామ్ చరణ్ పేరు కూడా ఆ సినిమాలో భైరవ. అదే పేరు రిపీటవుతోంది. ఈసారి ఆ హిట్టు మరికాస్త గట్టిగా ఉండాలని, ఉంటుందని కోరుకుందాం.)

Prabhas to star as Bhairava in Kalki 2898 AD:

Prabhas to star as Bhairava in the highly anticipated magnum opus Kalki 2898 AD 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs