Advertisement
Google Ads BL

విష్ణు మంచు కన్నప్ప ఫస్ట్ లుక్


మహాశివరాత్రి పర్వదినాన కన్నప్ప ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. కన్నప్పగా విష్ణు మంచు అందరినీ ఆకట్టుకునేలా ఈ పోస్టర్‌లో కనిపిస్తున్నారు. ఇన్ని రోజులుగా కన్పప్ప నుంచి రిలీజ్ చేసిన కంటెంట్‌ ఒకెత్తు అయితే.. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ మరో ఎత్తు అన్నట్టుగా సినిమాపై మరింత హైప్ పెరిగింది. 

Advertisement
CJ Advs

కన్నప్ప ఓ దృశ్యం కావ్యంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఒక ధైర్యవంతుడైన యోధుడు, శివుని భక్తుడైన కన్నప్ప కథను తెరపైకి తీసుకొస్తున్నారు. కన్నప్ప అచంచలమైన విశ్వాసం తరతరాలుగా అందరిలోనూ స్ఫూర్తిని నింపుతూ ఉంటుంది.  విష్ణు మంచు ఇంత గొప్ప పాత్రను అంతే గొప్పగా పోషిస్తున్నారు.

తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ కన్నప్ప కథను సంపూర్ణంగా చెప్పేస్తోంది. ఈ పోస్టర్ పాత్రలోని ధైర్యం, కారెక్టర్లోని డెప్త్, ఇంటెన్సిటీని చూపిస్తోంది. ఈ ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా ఎప్పటికీ చెరిగిపోని ముద్రను వేసేలా ఉంది. బాక్సాఫీస్‌పై విష్ణు మంచు ఆ విల్లు  ఎక్కుపెట్టినట్టుగా కనిపిస్తోంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రిలీజ్ చేసిన పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది.

కన్నప్పపై భారీ అంచనాలుండగా.. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌తో మరింత బజ్ పెరిగింది. కన్నప్పను తెరపై చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ భక్తి పురాణ గాథను ఎప్పుడెప్పుడు చూస్తామా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్ లాల్, ప్రభాస్, శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే.

Kannappa first look Released :

Manchu Vishnu Kannappa first look Released 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs