Advertisement
Google Ads BL

పెళ్ళిలో డాన్స్: ట్రోల్స్ పై స్టార్ హీరోల రియాక్షన్


బాలీవుడ్ సెలబ్రిటీస్ మొత్తం ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ లో చేసిన సందడి చూసాక చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. బాలీవుడ్ బడా స్టార్స్ అయ్యుండి అంబానీల ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ లో డాన్స్ లు చేయడంపై అందరూ ముక్కున వేలేసుకున్నారు. అంతేకాదు.. ఆ స్టార్ హీరోలకి డబ్బులిచ్చి అంబానీ ఈవెంట్ లో డాన్స్ లు చేయించుకున్నారంటూ బాలీవుడ్ మీడియా కోడై కూసింది. కంగనా లాంటి వాళ్ళు కొంతమంది పెళ్లిళ్లలో డాన్స్ చేస్తూ డబ్బు సంపాదించే కేరెక్టర్ కాదు అంటూ ఇండైరెక్ట్ గా స్టార్స్ పై కామెంట్స్ చేసినవారు ఉన్నారు.

Advertisement
CJ Advs

అయితే సోషల్ మీడియాలో ఖాన్ త్రయంపై వచ్చిన విమర్శలపై అమీర్ ఖాన్ దగ్గర నుంచి షారుఖ్, సల్మాన్ ఖాన్ లు స్పందించారు. అమీర్ ఖాన్ ని అయితే తన కుమార్తె పెళ్ళిలో డాన్స్ చెయ్యని వాడు అంబానీల పెళ్ళిలో డబ్బు తీసుకుని డాన్స్ చేసాడు అంటూ కామెంట్స్ చేసారు. దానికి అమీర్ ఖాన్ స్పందిస్తూ తాను తన కూతురు పెళ్ళిలో డాన్స్ చెయ్యకుండా అంబానీ పెళ్లిలో డాన్స్ చేశాను అన్నారు. నా కూతురు పెళ్ళిలో కూడా డాన్స్ చేశాను. ఆ వీడియో బయటికి రాలేదు కానీ.. ఈ పెళ్ళిలో డాన్స్ చేసిన వీడియో బయటకొచ్చింది అన్నాడు.

ఇక షారుఖ్ ఖాన్ అయితే ఇలాంటి ఈవెంట్స్ సరదాగా లో డాన్స్ చేస్తే తప్పేముంది. మా ఇంట్లో ఇలాంటి ఈవెంట్ జరిగితే అంబానీ ఫ్యామిలీ కూడా డాన్స్ చేస్తుంది. మా మధ్యన అంత అనుబంధం ఉంది అన్నాడు. ఇక సల్మాన్ ఖాన్ అయితే.. తనకి ఇలాంటి ఈవెంట్స్ లో డాన్స్ చెయ్యాలనిపిస్తుంది. కాబట్టే చేశాను, తానేమి డబ్బు తీసుకుని డాన్స్ చెయ్యలేదు అంటూ అంబానీల పెళ్ళిలో డబ్బు తీసుకుని డాన్స్ లు చేసారు అనే కామెంట్స్ పై ఖాన్ త్రయం ఇలా స్పందించింది. 

Dance at the Ambani pre wedding: Star heroes react to trolls:

SRK, Salman, Aamir performed for free at Anant Ambani and Radhika Pre Wedding bash
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs