Advertisement
Google Ads BL

ఓడిపోయానంటున్న నయనతార


నయనతార ఈమధ్యన మిస్టీరియస్ గా బిహేవ్ చేస్తుంది. ఎప్పుడూ సోషల్ మీడియాకి దూరంగా ఉండే నయనతార కొద్దిరోజుల క్రితమే తన పిల్లలతో కలిసి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి భర్త విగ్నేష్ శివన్, పిల్లలతో కలిసి ఎంజాయ్ చేసే ప్రతి క్షణాన్ని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ వస్తుంది. నయనతార విగ్నేష్ శివన్ ని ప్రేమ వివాహం చేసుకుంది. ఏడేళ్ళుగా ప్రేమించుకున్న ఈ జంట 2022 జూన్ లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. 

Advertisement
CJ Advs

ఆ తర్వాత నయనతార సరోగసి ద్వారా ఇద్దరు కవల పిల్లలకి తల్లయ్యింది. అప్పటి నుంచి భర్త విగ్నేష్, పిల్లలే నయనతార ప్రపంచం. సినిమా షూటింగ్స్ ఇంటి బాధ్యతలంతో నయనతార క్షణం తీరిక లేని జీవితాన్ని గడుపుతుంది. అయితే ఉన్నట్టుండి నయనతార తన భర్త విగ్నేష్ శివన్ ని ఇన్స్టాలో అన్ ఫాలో చెయ్యడం తీవ్ర చర్చలకి దారి తీసింది. విగ్నేష్ తో విభేదాలా?ఆమెకి భర్తకి మధ్యన ఏం జరిగింది అంటూ ఆరాలు తీశారు. మరోపక్క టెక్నీకల్ ప్రాబ్లెమ్ ఏమో అన్నవారూ లేకపోలేదు.

ఆ తర్వాత నయన్ మళ్ళీ భర్త విగ్నేష్ ని ఫాలో అవుతుంది. అదలా ఉంటే నయనతార మళ్ళీ ఓ పోస్ట్ పెట్టింది. నేను ఓడిపోయాను అంటూ నయనతార సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ చూసాక అందరిలో అనుమానాలు మరింతగా ఎక్కువయాయ్యి. వీటన్నిటికీ నయనతార చెక్ పెట్టింది. విగ్నేష్ అలాగే పిల్ల‌ల‌తో క‌లిసి విదేశాల‌కు వెళ్తున్న స‌మ‌యంలో తీసిన ఫొటోను షేర్ చేసింది. న‌య‌న్‌ త‌న ఫ్యామిలీతో క‌లిసి జెడ్డా టూర్‌కి వెళ్లిన‌ట్లు స‌మాచారం. 

అంతేకాకుండా చాలా కాలం త‌ర్వాత ఫ్యామిలీతో క‌లిసి ప్ర‌యాణిస్తున్నా అనే క్యాప్ష‌న్ పెట్టింది. మరి ఈ ఒక్క పిక్ తో నయనతార సోషల్ మీడియా పోస్ట్ లకు అర్ధాలన్నీ మారిపోయి అనుమానాల్ని ఎగిరిపోవాల్సిందే.

Nayanthara Shares Cryptic Message on Social Media:

Did Nayanthara really unfollow her husband Vignesh
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs