Advertisement
Google Ads BL

జాక్వలిన్ అపార్ట్మెంట్ లో అగ్ని ప్రమాదం


బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ అపార్ట్మెంట్ లో గత రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ముంబైలోని ఖరీదైన ప్రాంతమైన బాంద్రావెస్ట్ లోని నౌరోజ్ హిల్ సొసైటీలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ నివాసముంటుంది. ఈ అపార్ట్మెంట్ లోని 14వ ఫ్లోర్ అంటే జాక్వలిన్ ప్లాట్ కింది ప్లాట్ లో గత రాత్రి 8 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగగా.. అక్కడే ఉన్నకొంతంనుండి ఫైర్ ఇంజిన్ కి ఫోన్ చేసినట్లుగా తెలుస్తుంది.

Advertisement
CJ Advs

జాక్వలిన్ ప్లాట్ కింది ప్లాట్ లో మంటలు చెలరేగినప్పటికీ.. జాక్వలిన్ ఇంటికి ఎలాంటి నష్టము వాటిల్లలేదు అని, అలాగే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి హాని జరగలేదని పోలీసులు తెలిపారు. అయితే జాక్వలిన్ గత ఎడాది ఈ అపార్ట్మెంట్ లో ప్లాట్ కొనుక్కుంది. అది ముంబైలోని చాల కాస్ట్లీ ఏరియా అకావడమే కాకుండా.. అదే అపార్ట్మెంట్ లో చాలా మంది బిజినెస్ మ్యాన్స్, ప్రముఖ సెలబ్రిటీస్ నివసిస్తున్నారు.

సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్, రణబీర్ కపూర్, అలియా భట్ అలాగే మరికొంతమంది బాలీవుడ్ స్టార్స్ ఇక్కడ పక్కపక్కనే నివసిస్తున్నారు. ఇక జాక్వలిన్ ఫెర్నాండేజ్ ఈ మధ్యన సుఖేష్ చంద్రశేఖర్ కేసులో కీలక పాత్రధారిగా మారి అరెస్ట్ అయ్యే సమయానికి బెయిల్ తెచ్చుకుని బయట తిరుగుతుంది. సుఖేష్ చంద్రశేఖర్ నుంచి ఖరీదైన గిఫ్ట్ లు అందుకున్నట్టుగా జాక్వలిన్ ఆరోపణలు ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే. 

Fire accident in Jacqueline apartment:

Fire breaks out in Jacqueline Fernandez 17-storey building in Mumbai
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs