నందమూరి బాలకృష్ణది చిన్న పిల్లల మనస్తత్వం. ఆయన ఎవరితోనైనా తొందరగా క్లోజ్ అవుతారు. అదే విధంగా కోపము తెచ్చుకుంటారు. అభిమానులపై బాలయ్య చెయ్యెత్తి కొట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. బాలయ్య కి కోపమొస్తే తమాయించుకోలేరు. అందుకే తనకి కోపం తెప్పించిన వారిపై చెయ్యి చేసుకుంటారు. కొన్నిసార్లు ఇలాంటివి వివాదాలకు దారి తీసినా మరికొన్ని సందర్భాలలో అభిమానులే సర్ది చెప్పుకుంటారు. గతంలో సినిమా సెట్స్ లో బాలయ్య ఓ అసిస్టెంట్ డైరెక్టర్ పై చేయి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
తాజాగా బాలకృష్ణ షూటింగ్ స్పాట్ లో చెయ్యి చేసుకోవడంపై ఆయనతో పని చేసిన ఓ దర్శకుడు చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.. బాలకృష్ణ తో రూలర్, జై సింహ చిత్రాలని తెరకెక్కించిన దర్శకుడు కేఎస్ రవికుమార్ బాలయ్యకి ఎవరైనా నవ్వితే తెగ కోపమొచ్చేసి చెయ్యి కూడా చేసుకుంటారంటూ తన సినిమా సెట్స్ లో జరిగిన ఓ సందర్భాన్ని రీసెంట్ గా జరిగిన ఓ ఈవెంట్ లో రివీల్ చేసాడు. షూటింగ్‌లో ఎవరైనా నవ్వుతున్నట్లు కనిపిస్తే ఆయన ఊరుకోడు. తనని చూసి నవ్వుతున్నారని అనుకుంటాడు. దానితో ఆయనకి కోపం వచ్చేస్తుంది. అలా నవ్వుతున్న వ్యక్తిని పిలిచి మరీ కొడతాడు.
నేను బాలయ్య తో తెరకెక్కించిన ఓ సినిమా షూటింగ్ సమయంలో నా అసిస్టెంట్ శరవణన్‌ను ఆయన ఫ్యాన్ తీసుకురమ్మని చెప్పాడు. శరవణన్ అనుకోకుండా ఆ ఫ్యాన్ బాలయ్య వైపు తిప్పడంతో బాలయ్య విగ్గు కాస్త అటు ఇటు అయ్యింది. ఆయన అది సర్దుకుంటున్న సమయంలోనే శరవణన్ నవ్వాడు. అతని నవ్వు చూడగానే బాలకృష్ణకు కోపం వచ్చేసింది. ఎందుకు నవ్వుతున్నావ్ అని గట్టిగా అరిచాడు, ఆయన కోపం నాకు తెలుసు కాబట్టి అతన్ని ఎక్కడ కొట్టేస్తాడో అని నేను అతను మన అస్సిస్టెంటే అని చెప్పాను.
అయినా బాలయ్యకి కోపం తగ్గలేదు. అప్పుడు నేను గట్టిగా అరుస్తూ అతన్ని అక్కడి నుంచి వెళ్లిపోమ్మన్నాను. అప్పుడు బాలయ్య కాస్త స్థిమిత పడ్డాడు అంటూ రవికుమార్ తన సినిమా షూటింగ్ టైమ్ లో బాలయ్య కోపాన్ని బయటపెట్టారు.